
ఆత్మహత్య చేసుకున్న కవిత (ఫైల్ ఫొటో)
కృష్ణరాజపురం : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెట్టే వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం బన్నేరుఘట్టలో చోటు చేసుకుంది. బన్నేరుఘట్టకు చెందిన కవిత (26)కు అదే ప్రాంతానికి చెందిన అప్పు అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో నాలుగేళ్ల క్రితం తల్లితండ్రులను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది కాలం సజావుగానే సాగిన కవిత కాపురంలో కొద్ది కాలంగా కలతలు, కలహాలు మొదలయ్యాయి. భర్త ఏపని చేయకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటుండడం దురలవాట్లకు, జల్సాలకు బానిసవడంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పైగా కవితపై అనుమానంతో ప్రతీరోజూ శారీరకంగా, మానసికంగా కూడా వేధించసాగాడు. రోజురోజుకు భర్త వేధింపులు తీవ్రతరం కావడంతో కొద్ది రోజుల కిత్రం బన్నేరుఘట్టలోని తల్లితండ్రుల ఇంటికి చేరుకున్న కవిత శనివారం వీడియోలో భర్త పెడుతున్న వేధింపుల గురించి వివరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కవిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment