బిగ్‌బాస్ ప్రయాణం ముగింపుకు చేరుతుండటంతో షోకు మరింత వన్నె తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే నేటి ఎపిసోడ్‌లో నాగార్జునకు బదులుగా కన్నడ స్టార్ హీరో, కన్నడ బిగ్‌బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ ప్రత్యక్షం అయ్యారు. ఆయనను చూసి ఇంటిసభ్యులు సర్‌ప్రైజ్ అవుతూనే నాగ్ సార్ కనిపించట్లేదే అని గాబరా పడ్డారు. ఇంతలో అరియానా ధైర్యం చేసి నాగ్ సార్ ఎక్కడ? అని సుదీప్‌ను నిలదీసింది. దీంతో వారిని కాసేపు ఆడుకుందామనుకున్న సుదీప్ ఆయన ఇంటికెళ్లారని అబద్ధం చెప్పారు. మీ వల్ల ఆయన చాలా అలిసిపోయారని చెప్పుకొచ్చారు. కానీ కంటెస్టెంట్లు మహా ముదుర్లు.. ఆయన మాటలను అస్సలు నమ్మలేదు. దీంతో అసలు నాగ్ ఎందుకు రావాలో సరైన కారణం చెప్పమని సుదీప్ అడగ్గా నాగ్ సర్ కింగ్, ఆయనే బెస్ట్ అని తెలిపారు. వారి మాటలతో ఏకీభవించిన స్పెషల్ గెస్ట్ సుదీప్ హోస్ట్ నాగార్జునను స్టేజీ మీదకు పిలిచారు. (చదవండి: మోనాల్‌తో లింక్ చేయకండి: అభి వేడుకోలు)
తర్వాత సుదీప్ అవినాష్‌కు ఓ చిలిపి ప్రశ్న వేశారు. ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేట్‌కు వెళ్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? అని అడగ్గా అవినాష్ ఏం చెప్పేదిరా దేవుడా? అని జుట్టు పట్టుకున్నాడు. ఇంతలో నాగ్ అందుకుని అవినాష్ పెద్ద పులిహోర అని అతడి పరువు తీశారు. అవినాష్ మాత్రం నోటితో సమాధానం చెప్పకుండా డేట్ అన్నప్పుడు హారిక వైపు, మ్యారేజ్ అన్నప్పుడు మోనాల్ వైపు, కిల్ అన్నప్పుడు అరియానా వైపు చేయి చూపించాడు. దీన్ని కన్నడ హోస్ట్ పసిగట్టి చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. తర్వాత మోనాల్‌కు బదులు సుదీప్ పొరపాటున అఖిల్ పేరు పిలిచారు. అయితే వాళ్లిద్దరిలో ఎవర్ని అడిగినా ఒకటే అని నాగ్ ఇద్దరికీ ముడేశారు. తర్వాత మోనాల్ లేచి తన మనసులో మాట చెప్పినట్లు తెలుస్తోంది. నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఆమె చెప్పడంతో నాగ్‌తో సహా సుదీప్ ఉబ్బితబ్బిబయ్యారు. మరి ఆయన ఏం సమాధానం చెప్తారో ఏమో? ఏదేమైనా ఒకే స్టేజీ మీద ఇద్దరు స్టార్లు కలిసి చేసిన సందడి చూడాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. (చదవండి: బిగ్‌బాస్: నేడు నో ఎలిమినేషన్!)
Comments
Please login to add a commentAdd a comment