నేను ఎలిమినేట్ అయ్యాను: అవినాష్‌ భావోద్వేగం | Bigg Boss 4 Telugu: Avinash Disappointed For He Got Least Votes | Sakshi
Sakshi News home page

హారిక‌ను పెళ్లి చేసుకుంటా: అవినాష్‌

Published Sun, Nov 29 2020 11:10 PM | Last Updated on Mon, Nov 30 2020 11:51 PM

Bigg Boss 4 Telugu: Avinash Disappointed For He Got Least Votes - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ పన్నెండో వారాంతంలో స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ త‌న మాట‌ల గార‌డీతో ఆక‌ట్టుకున్నారు. న‌వ్విస్తూ, పంచ్‌లు వేస్తూ, క‌లిసిపోతూ కాసేప‌టివ‌ర‌కు హోస్ట్‌గా అంద‌రినీ మైమ‌రిపించారు. మ‌రోవైపు నిన్న నాగ్ చేతులెత్తి వేడుకోవ‌డాన్ని చూసి బాధ‌ప‌డ్డ కంటెస్టెంట్లు ఆయ‌న్ను సంతోష‌రిచేందుకు డ్యాన్స్‌ల‌తో హోరెత్తించారు.  నాగ్‌తో తిట్టించుకున్న అభి త‌న స్టెప్పుల‌తో మెప్పు పొందాడు. ఇక ప్రేక్ష‌కులు త‌క్కువ ఓట్ల‌తో అవినాష్‌ను ఫెయిల్ చేసినా బిగ్‌బాస్ ఇచ్చిన పాస్‌తో అవినాష్ ఎలిమినేష‌న్ నుంచి గ‌ట్టెక్కాడు. మ‌రి వినోదాల మేళ‌వింపుగా మారిన‌ నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్ ఎలా కొన‌సాగిందో చ‌దివేయండి..

గుండె ఆగిపోతుంద‌ని ఏడ్చేసిన అరియానా
నాగార్జున కోపాన్ని చ‌ల్లార్చేందుకు ఇంటి స‌భ్యులు నాగ్ సాంగ్స్‌కు చిందేస్తూ ప‌ర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అవినాష్ -అరియానా, అభిజిత్ -మోనాల్, సోహైల్ -హారిక జంట‌లుగా క‌లిసి డ్యాన్స్ చేశారు. వీరి మాస్ డ్యాన్స్ చూసి నాగ్ సైతం సంతోషించారు. త‌ర్వాత‌ నాగ్‌ 'చీక‌టిలో ధైర్యం స్థైర్యం' టాస్క్‌తో మ‌రోసారి కంటెస్టెంట్ల‌ను భ‌య‌పెట్టించే ప్ర‌య‌త్నం చేశారు. మొద‌ట‌గా అరియానా దెయ్యం గ‌దిలోకి వెళ్ల‌డానికి వెళ్ల‌డానికి నిరాక‌రించింది. నన్ను ఒదిలేయండి, నా గుండె ఆగిపోతుంది అని ఏడ్చేయ‌డంతో ఆమెను ప‌క్క‌న పెట్టేశారు. త‌ర్వాత సోహైల్‌.. లోప‌ల‌కు వెళ్ల‌గా భ‌య‌ప‌డుతూనే ఒక్కో అడుగు ముందుకు వేశాడు. గ‌జ్జెల శ‌బ్ధం విన‌ప‌డేస‌రికి గ‌జ‌గ‌జ వ‌ణికిపోయాడు. అఖిల్ భ‌యాన్ని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : తొలిసారి అభిజిత్‌ భావోద్వేగం)

లోప‌ల భ‌య‌ప‌డ్డాను: అభిజిత్‌
అభిజిత్ అయితే ఈల‌లు వేసుకుంటూ మ‌రీ వెళ్లాడు కానీ లోప‌ల కొంచెం భ‌యంగా ఉండేన‌ని అస‌లు విష‌యం చెప్పాడు. ఇక అవినాష్ దెయ్యం అరుపుల‌కు ద‌డుసుకుంటూనే రూమ్ అంతా క‌లియ‌తిరిగాడు. లోనికి వెళ్లిన‌ హారిక, మోనాల్‌ ఏమాత్రం అద‌ర‌లేదు, బెద‌ర‌లేదు. మొన్నటి దెయ్యం టాస్కులో సోహైల్‌, అఖిల్ భ‌య‌మంటే ఏంటో తెలీదంటూ బ‌య‌ట‌కు ఫోజులు కొట్టిన‌ప్ప‌టికీ చీక‌టి గదిలోకి వెళ్లాక చిన్న‌పిల్ల‌ల్లా ద‌డుసుకున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమా అంత‌టినీ నాగ్‌ కంటెస్టెంట్లకు చూపించి వారి ప‌రువు తీశారు. త‌ర్వాత అరియానా ధైర్యం తెచ్చుకుని ఒంట‌రిగా చీక‌టి గ‌దిలోకి వెళ్లి రాగా, భ‌యాన్ని జ‌యించాన‌ని సంబర‌ప‌డిపోయింది. (చ‌ద‌వండి: నీతో రిలేష‌నే వ‌ద్దు: తేల్చేసిన అఖిల్‌)

కంటెస్టెంట్ల ఆట క‌ట్టించిన‌ కిచ్చా సుదీప్‌
త‌ర్వాత‌ క‌న్న‌డ‌ బిగ్‌బాస్ ఏడు సీజ‌న్ల‌ను వ‌రుస‌గా హోస్ట్ చేస్తున్న కిచ్చా సుదీప్ ప్ర‌త్యేక అతిథిగా వ‌చ్చారు. వ‌స్తూనే ఈ కంటెస్టెంట్ల వ‌ల్ల చాలా అలిసిపోయాను అని నాగ్ స‌ర్ వెళ్లిపోయారు అని చెప్పారు. కానీ వాళ్లు న‌మ్మక‌పోవ‌డంతో, నాగ్ ఎందుకు వెన‌క్కు రావాలో స‌రైన కార‌ణాలు చెప్తే లోనికి రానిస్తాన‌న్నారు. దీంతో ఒక్కొక్క‌రు నాగ్ గురించి చెప్ప‌డం మొద‌లు పెడుతూ ఉండ‌గా వారంద‌రికీ సుదీప్ కౌంట‌ర్లు ఇస్తూ వ‌చ్చారు. నాగ్ స‌ర్ మా మీద కేరింగ్‌తో స్వెట‌ర్లు, డ్రైఫూట్లు, డ్రెస్సులు తీసుకువ‌చ్చారు అని అరియానా చెప్ప‌గా ఒక‌వేళ నేను స్వెట‌ర్ ఇస్తే నేనూ ఇక్క‌డే ఉండొచ్చా అని పంచ్ వేశారు. కంటెస్టెంట్ల‌పై కౌంట‌ర్ల ప‌ర్వం ముగిసిన త‌ర్వాత‌ నాగ్‌ స్టేజీ మీద‌కు విచ్చేశారు. (చ‌ద‌వండి: ట్రోలింగ్‌: అప్పుడు నాని, ఇప్పుడు నాగార్జున‌)

గెలుపు క‌న్నా విధేయ‌తే ముఖ్యం: హారిక‌
ఇక సుదీప్‌.. అవినాష్‌ను ఇర‌కాటంలో ప‌డేసే చిలిపి ప్ర‌శ్న అడిగారు. ఎవ‌రితో డేట్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవ‌రిని చంపుతావు? అని ప్ర‌శ్నించారు. మోనాల్‌తో డేట్‌, హారిక‌తో పెళ్లి, కానీ అరియానాను మాత్రం చంపుతాన‌ని చెప్పారు. హారిక‌ను నీకు విధేయ‌తా ముఖ్య‌మా?  గెలుపు ముఖ్య‌మా? అన్న ప్ర‌శ్న‌కు ఆమె విధేయ‌తే ముఖ్య‌మ‌ని స‌మాధాన‌మిచ్చింది. అభిజిత్‌కు హారిక షార్ట్ హెయిర్‌తో ఉంటే ఇష్ట‌మా? పొడు‌వు జుట్టుతో ఉంటే ఇష్ట‌మా? అన్న ప్ర‌శ్న‌కు చిన్న జుట్టు ఉంటేనే బాగుంటుంద‌ని చెప్పుకొచ్చాడు. అరియానాను ఒక్క‌రోజు నువ్వు అవినాష్‌లా నిద్ర‌లేస్తే చేసే మొద‌టి ప‌ని ఏంటి? అని అడ‌గ్గా తానస‌లు నిద్ర‌లో నుంచే లేచే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెప్పింది. సోహైల్‌కు మ‌ట‌న్ లేదా చికెన్‌లో ఏది ఎక్కువ ఇష్ట‌మంటే మ‌ట‌న్ అని జ‌వాబిచ్చాడు. (చ‌ద‌వండి: అభిజిత్‌కే ఓటేస్తా: జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌)

అఖిల్‌ను సేఫ్ చేసిన సుదీప్‌
త‌ర్వాత సుదీప్‌ మోనాల్‌ను పిల‌వ‌బోయి అఖిల్‌ను పిలిచారు. అయితే వీళ్లిద్ద‌రిలో ఎవ‌రిని అడిగినా ఒక‌టేలే అని నాగ్ ఇద్ద‌రికీ ముడి పెట్టేశారు. త‌ర్వాత‌.. నీకు ఇంట్లో ఒక హౌస్‌మేట్‌ను మాయం చేయ‌గ‌ల శ‌క్తి ఉంటే ఎవరిని చేస్తావన్న ప్ర‌శ్న‌కు అఖిల్‌.. మోనాల్ పేరు చెప్పాడు. ఒక‌వేళ నీగురించి నువ్వు ఏదైనా పుకారు మొద‌లుపెట్టాల‌నుకుంటే అది ఏంటి? అన్న ప్ర‌శ విసిర‌గా దానికి మోనాల్.. నేను ఏడ‌వ‌ను అని చాటింపు చేస్తాన‌ని చెప్పింది. గుజ‌రాతీ అయినా తెలుగు బాగా మాట్లాడుతున్నందుకు సుదీప్‌ ఆమెను మెచ్చుకున్నారు. ప‌నిలో పనిగా నాగ్‌ను చూస్తూ ఒక డైలాగ్ చెప్ప‌మ‌న్నారు. దీంతో ఆమె నువ్వు నాకు చాలా ఇష్టం అని నాగ్‌తో చెప్పి సిగ్గుల మొగ్గ‌యింది. కానీ అది ఇద్ద‌రికీ చెప్పిన‌ట్లు అనిపించింది. త‌ర్వాత సుదీప్‌.. అఖిల్ సేఫ్ అయిన‌ట్లు వెల్ల‌డించారు. అనంత‌రం తెలుగు బిగ్‌బాస్ షోకు వీడ్కోలు తీసుకుంటూ తాను థియేట‌ర్‌లో చూసిన మొద‌టి సినిమా గీతాంజ‌లి అని చెప్పారు.

ప్రేక్ష‌కులు న‌న్ను ఎలిమినేట్ చేశారు
చివ‌రగా అవినాష్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ వాడ‌టంతో అత‌డు ఎలిమినేష‌న్ నుంచి బ‌య‌ట‌పడ్డాడు. అయితే ప్రేక్ష‌కుల దృష్టిలో మాత్రం తాను ఎలిమినేట్ అయ్యాన‌ని అవినాష్ బాధ‌ప‌డ్డాడు. ఇప్పుడు నేను ముందుకెళ్లాలా? ఆగిపోవాలా? అనేది అర్థం కావ‌ట్లేద‌న్నారు. దీంతో నాగార్జున అత‌డికి ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కు రాక‌ముందు ఉన్న అవినాష్ వేరు, హౌస్‌లోకి వ‌చ్చాక అవినాష్ వేర‌ని అత‌డిని ఆకాశానికెత్తారు. నీ ద‌గ్గ‌ర పాస్ ఉంద‌నే ఓట్లు వేయ‌లేదు అనుకోవ‌చ్చు క‌దా అని పాజిటివిటీని నూరి పోశారు. కానీ కొత్త‌గా ఇలాంటి మాట‌ల‌తో సింప‌థీ మాత్రం మొద‌లు పెట్టొద్ద‌ని సుతిమెత్త‌గా హెచ్చ‌రించారు. అందరూ ఎవరి ఆట వారే ఆడండ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. (చ‌ద‌వండి: కెప్టెన్‌గా విఫ‌ల‌మైన హారిక‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement