నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం | Actor Kiccha Sudeep Mother Saroja Sanjeev Passes Away At Age Of 86 | Sakshi
Sakshi News home page

Kiccha Sudeep Mother Death: నటుడు 'కిచ్చా సుదీప్' ఇంట తీవ్ర విషాదం

Published Sun, Oct 20 2024 12:49 PM | Last Updated on Sun, Oct 20 2024 2:11 PM

Actor Kiccha Sudeep Mother Saroja Sanjeev Passes Away

కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట తీవ్ర విషాదం జరిగింది. అక్టోబర్‌ 20 ఆదివారం తెల్లవారుజామున ఆయన తల్లి సరోజా సంజీవ్‌ (86)  మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు  ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో సుదీప్‌ కుటుంబం శోకసంద్రంలో ఉంది.

బెంగళూరు జేపీ నగర్‌లోని సుదీప్ నివాసంలో సరోజ భౌతికకాయాన్ని చివరి చూపు కోసం ఉంచనున్నారు.  ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. సరోజకు నటుడు సుదీప్‌తో సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరోజ మృతి పట్ల సుదీప్ అభిమానులతో పాటు  సినీ పరిశ్రమకు చెందిన స్నేహితులు, బంధువులు సంతాపం తెలిపారు. జేపీ నగర్ నివాసానికి ఇప్పటికే సుదీప్ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. మంగళూరుకు చెందిన సుదీప్ తల్లి సరోజ సినిమా పరిశ్రమకు దూరంగానే ఉండేవారు. అయితే, తన తల్లితో పాటు మంగళూరుకు కొద్దిరోజుల క్రితమే సుదీప్‌ వెళ్లిన విషయం తెలసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement