
యశవంతపుర(బెంగళూరు): అపరిచిత వ్యక్తి రాసిన లేఖపై వస్తున్న వదంతులను పత్రికల్లో, టీవీల్లో ప్రసారం చేయరాదని కోరుతూ ప్రముఖ నటుడు సుదీప్ కోర్టు తలుపు తట్టారు. నగరంలో మెయో హాల్‌లోని కోర్టులో పిటిషన్ వేశారు. అపరిచిత వ్యక్తి రాసిన లేఖలోని వివరాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని సెషన్స్‌కోర్టును కోరారు. ఇటీవల సుదీప్ సీఎం బొమ్మైను కలిసి మద్దతు ప్రకటించడం, ఆ వెంటనే నీ ప్రైవేటు వీడియోలను బయటపెడతామని రెండు బెదిరింపు లేఖలు రావడం తెలిసిందే.
ప్రాణహాని బెదిరింపులతో పాటు సుదీప్ కుటుంబసభ్యుల పేర్లను అపరిచితులు లేఖలో రాశారు. వీటిపై అనేక రకాలుగా మాధ్యమాలలో వార్తలు వస్తుండగా, వాటిని నివారించాలని ఆయన లాయర్లు కోరారు. మరోవైపు సుదీప్‌కి గన్‌మాన్ రక్షణ కల్పించాలని నిర్మాత మంజు పోలీస్ కమిషనర్‌కు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment