భారతీయ సినిమాలో విలక్షణ నటుల్లో కిచ్చా సుధీప్ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. పాత్ర స్వ భావం కోసం తనను తాను మార్చు కోవడానికి ఎంత దాకా అయినా వెళ్లే నటుడు కిచ్చా సుధీప్. స్వతహాగా కన్నడీయుడైన ఈయన మాతృభాషతో పాటు తమి ళం, తెలుగు భాషల్లోనూ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు రామ్‌గోపాల్ వర్మ చిత్రాల ద్వా రా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరితుడైన కిచ్చా సుధీప్ తాజాగా ‘పహిల్వాన్’గా మారారు. అవును కిచ్చా సుధీప్ తాజా చిత్రానికి పహిల్వాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
ఈ చిత్రం కోసం మారిన రూపం చూస్తే అందుకోసం ఎంత కసరత్తులు చేశారో, అందుకు ఎంత శ్రమించారో మీకే అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంతో కిచ్చా సుధీప్ మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పహిల్వాన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్‌ఆర్ మోషన్ పిక్చర్స్ పతాకంపై స్వప్నకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇది ఎమోషనల్, కామెడీ అంశాలతో కూడిన క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఒక మల్ల యుద్ధక్రీడాకారుడైన కిచ్చా సుధీప్ ఆ క్రీడలో ఎదుర్కొనే సవాళ్లు, వాటిని ఎలా అధిగమించాడు అన్న కథతో తెరకెక్కిస్తున్న చిత్రం పహిల్వాన్ అని తెలిపారు. దీనికి హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం అని అన్నారు.
నటి ఆకాంక్ష కథానాయకిగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నటుడు సుశాంత్ సింగ్, కబీర్ దుహాన్ సింగ్, శరత్ లోకిదాస్, అవినాష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గత జనవరిలో విడుదల చేయగా కిచ్చా సుధీప్ బేర్ బాడీతో కూడిన సన్నివేశాలకు అనూహ్యా స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపారు.
ఈ చిత్ర కథను తెరకెక్కించే ముందే నటుడు కిచ్చాసుధీప్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించానన్నారు. అలా తాను ఊహించిన దానికంటే నటుడు కిచ్చా సుధీప్ సిక్స్ ప్యాక్, 8 ప్యాక్‌లను మించి తన బాడీని తయారు చేసుకున్నారని దర్శకుడు కృష్ణ చెప్పారు. మరో విశే షం ఏమిటంటే కిచ్చా సుధీప్ బాక్సర్ గెటప్‌లోని పోస్టర్‌ను ఐదు భాషల్లోని ప్రముఖ నటులు చిరంజీవి తెలుగు పోస్టర్‌ను, హిందీ పోస్టర్‌ను సునీల్ శెట్టి, తమిళ పోస్టర్‌ను విజయ్‌సేతుపతి, మలయాళ పోస్టర్‌ను మోహన్‌లాల్ ఆవిష్కరించారని తెలిపారు. దీనికి అర్జున్ జాన్యా సంగీతాన్ని, కరుణాకర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment