Pahilvan
-
అక్బరుద్ధీన్‌పై దాడి కేసు: పహిల్వాన్ మృతి
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీపై దాడి చేసిన మహమ్మద్ పహిల్వాన్ మంగళవారం మృతి చెందారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్బరుద్ధీన్‌పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన పహిల్వాన్ బెయిల్‌పై బయట ఉంటున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో అక్బరుద్ధీన్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. పలు కత్తిపోట్లకు గురయ్యారు. ఆ సమయంలో అక్బరుద్దిన్ శరీరంలో నుంచి డాక్టర్లు కేవలం ఒకే బుల్లెట్ తీశారు. దీంతో ఆయన శరీరంలో ఉన్న మరో బుల్లెట్ కారణంగా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. అక్బరుద్ధీన్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి విదితమే. -
నా జీవితంలో ఈగను మర్చిపోలేను
‘‘ఒకప్పుడు సౌత్ ఫిల్మ్స్.. నార్త్ ఫిల్మ్స్ అని ఒక వ్యత్యాసం ఉండేది. కానీ ఈ రోజు నార్త్.. సౌత్ అనేది లేదు. మొత్తం ఇండియన్ ఫిల్మే అయ్యింది. అంటే ఎక్స్ఛేంజ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నమాట. అక్కడివాళ్లు ఇక్కడ, ఇక్కడివాళ్లు అక్కడ చేస్తున్నారు. ఇది శుభపరిణామం. తెలుగు సినిమాల డబ్బింగ్ రైట్స్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇలా అన్ని రాష్ట్రాల మధ్య సంబంధాలు ఒకేలా కొనసాగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఎస్. కృష్ణ దర్శకత్వంలో సుదీప్ హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటించారు. స్వప్న కృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. నిర్మాత సాయి కొర్రపాటి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘జీవితంలో మనం అందరం మన కోసం సాధించుకుంటాం. కానీ దేశం కోసం సాధించిన సింధుగారిని అభినందించాలి. ఈ మధ్య భారతదేశం సాధించిన ఒక గొప్ప విజయం, విషయం ఏంటంటే చంద్రయాన్. ‘చంద్రయాన్’ అనే రాకెట్‌ని క్షక్ష్యలోకి ప్రవేశపెట్టి దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు. బ్యాడ్మింటన్ రాకెట్‌తో దేశం మొత్తం మనవైపు చూసేలా చేశారు సింధుగారు. ఇక కన్నడ ప్రజలు, తెలుగు ప్రజలు కవల పిల్లలులాంటివారు. తెలుగు పరిశ్రమకు కన్నడ రాష్ట్రం ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసు. తెలుగు సినిమాను కూడా కన్నడ సినిమాలానే ఫీల్ అవుతారు. మనవాళ్లు కూడా ఒక మంచి కన్నడ చిత్రం వచ్చిందంటే తెలుగు సినిమా కన్నా ఎక్కువగా నెత్తిన పెట్టుకుని చూస్తారు. దానికి ఉదాహరణ ‘కేజీఎఫ్’. అలాగే ఈ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. సుదీప్ ఏ భాషలో నటించినా అక్కడి ప్రజల మనసును పరిపూర్ణంగా చూరగొనే ఆర్టిస్ట్. సుదీప్ ఆల్రెడీ సర్టిఫైడ్ హీరో. కానీ ఆయన ఆ బౌండరీలో లేడు. ఏ రాష్ట్రం వారు పిలిచినా ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందంటే ఆ రాష్ట్రానికి వెళతాడు. నటిస్తాడు. ఆ క్యారెక్టర్‌కు న్యాయం చేసి వస్తాడు. ఈ సినిమా కోసం సుదీప్ బాడీ షేపప్ చేశాడు.. చాలా తగ్గాడు. అఫ్కోర్స్... మన ఇండియన్ హీరోలంతా అంతే. మన తెలుగు వాళ్లలో ఉదాహరణకు... ప్రభాస్, మహేశ్, చరణ్, తారక్.. ఇలా అందరూ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా తగ్గుతారు. ఇప్పుడు బాలకృష్ణ 11 కేజీలు తగ్గారు. ‘సరైనోడు’ కోసం బన్నీ, ‘ఇస్మార్ట్ శంకర్’ కోసం రామ్.. ఇలా ఎవరికి వారు డైరెక్టర్ని బాడీ ఎలా కావాలి? ఒక కథకు ఏం కావాలి? అని అడిగి తమను తాము మౌల్డ్ చేసుకుంటున్నారు. ఈ కోవలో సుదీప్ కూడా ఉన్నారు. సాయి కొర్రపాటిగారు మంచి మూవీ లవర్. మన సినిమాలను ఇతర భాషల్లో, ఇతర భాషల్లోని సినిమాలను మనకు చూపించాలని తాపత్రయపడుతుంటారు. అందుకు ఓ ఉదహరణ ఈ ‘పహిల్వాన్’ సినిమా. ఇంతకుముందు ఆయన తెలుగులో విడుదల చేసిన ‘కేజీఎఫ్’ చిత్రానికి మంచి రెవెన్యూ వచ్చింది. ‘పహిల్వాన్’ కూడా అంత మంచి సినిమా అవ్వాలి. దర్శకుడు కృష్ణగారు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. సింధు గోల్డ్ మెడల్ కొట్టినట్లే ఈ సినిమా కూడా అంతటి స్థాయిలోకి వెళ్లాలి’’ అన్నారు. ‘‘ఇలాంటి సినిమాలు చాలామందికి స్ఫూర్తిని ఇస్తాయి. కష్టపడితేనే సక్సెస్ వస్తుంది. ట్రైలర్ చూశాను. సుదీప్‌గారు చాలా కష్టపడ్డారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. మనపై నమ్మకం ఉంచి ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. కష్టపడితేనే పైకి రాగలం. ముందు ముందు దేశానికి ఇంకా మంచి పేరు తీసుకురావడానికి కష్టపడతాను. ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వేదికపై ఉండటం హ్యాపీ. ‘పహిల్వాన్’ సినిమా చూడండి’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ‘‘ఈ వేదికపై సింధుగారు ఉండటం మాకు చాలా గౌరవంగా ఉంది. సింధుని ఇండియాకి ఇచ్చిన ఆమె తల్లిదండ్రులకు థ్యాంక్స్. వేదికలపై నేను అంతగా మాట్లాడలేను. నెక్ట్స్ టైమ్ ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడతాను. గ్రామర్ తప్పులు లేకుండా మాట్లాడతాను. తెలుగు ప్రేక్షకులు నాకు చాలా గౌరవాన్ని, ప్రేమను అందిస్తున్నారు. నా జీవితంలో ‘ఈగ’ చిత్రాన్ని, రాజమౌళిగారిని, తెలుగు ప్రేక్షకులను మర్చిపోలేను. నిర్మాత సాయిగారు నాకు వెరీ స్పెషల్. మంచి మానవతావాది ఆయన. నన్ను అభినందించిన బోయపాటిగారికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం దర్శకుడు కృష్ణ నిర్మాతగా మారారు. చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నాను. భవిష్యత్‌లో సింధు మేడమ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుదీప్. ‘‘పహిల్వాన్’ సినిమాతో హైదరాబాద్‌కు స్పెషల్ కనెక్షన్ ఉంది. సినిమా చిత్రీకరణ ఇక్కడే మొదలైంది. మేజర్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరిగింది. ఈ సినిమాను తెలుగులో ఈ స్థాయిలో విడుదల చేస్తున్న సాయిగారికి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు కృష్ణ. ‘‘ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ అన్నారు’’ చాముండేశ్వరీనాథ్. ‘‘తెలుగు రాష్ట్రాల్లో సుదీప్‌గారికి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించిన ప్రతి తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. ‘పహిల్వాన్’ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. బ్రహ్మాండమైన ఆల్బమ్ కుదరింది. ఈ చిత్రం ద్వారా అర్జున్ జన్యలాంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు పరిచయం కావడం నా అదృష్టం’’ అన్నారు రామజోగయ్య శాస్త్ర్రి. ‘‘ఈ సినిమాలో రుక్మిణి పాత్ర చేశాను. నాది రొటీన్ హీరోయిన్ పాత్ర కాదు’’ అన్నారు ఆకాంక్షా సింగ్. కబీర్ దుహాన్ సింగ్, కార్తీక్, రామారావు, సాయి కొర్రపాటి తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు
‘బలం ఉందన ్న అహంతో కొట్టేవాడు రౌడీ.. బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’ అనే డైలాగులతో ప్రారంభమైన ‘పహిల్వాన్’ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోగా ఎస్. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పహిల్వాన్’. ఈ సినిమాను అదే పేరుతో వారాహి చలన చిత్రం తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. సెప్టెంబర్ 12న సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సుదీప్ రెజ్లర్ పాత్రలో కనిపిస్తారు. చిరంజీవిగారు ఇటీవల విడుదల చేసిన ‘పహిల్వాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. గురువారం విడుదలైన ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వస్తోంది. ‘‘కె.జి.యఫ్’ని తెలుగులో రిలీజ్ చేసి ఘనవిజయం అందుకున్న వారాహి చలన చిత్రం సంస్థ ఇప్పుడు ‘పహిల్వాన్’ను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకి సంగీతం: అర్జున్ జన్యా, కెమెరా: కరుణాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. దేవరాజ్. -
పహిల్వాన్ వస్తున్నాడు
‘ఈగ’తో ఇబ్బందులు పడి తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్. తాజాగా ‘పహిల్వాన్’ అనే చిత్రంలో నటించారాయన. ఇందులో మల్ల యోధుడి పాత్రలో కనిపించనున్నారు. కన్నడంలో రూపొందిన ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఎస్. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ‘‘ఆల్రెడీ రిలీజయిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్ట్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశాం’’ అని నిర్మాతలు తెలిపారి. ‘కేజిఎఫ్’ను తెలుగులో రిలీజ్ చేసింది వారాహి బ్యానరే కావడం విశేషం. -
తమిళ్లో ‘పహిల్వాన్’
భారతీయ సినిమాలో విలక్షణ నటుల్లో కిచ్చా సుధీప్ ఒకరని కచ్చితంగా చెప్పవచ్చు. పాత్ర స్వ భావం కోసం తనను తాను మార్చు కోవడానికి ఎంత దాకా అయినా వెళ్లే నటుడు కిచ్చా సుధీప్. స్వతహాగా కన్నడీయుడైన ఈయన మాతృభాషతో పాటు తమి ళం, తెలుగు భాషల్లోనూ నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అంతేకాదు రామ్‌గోపాల్ వర్మ చిత్రాల ద్వా రా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరితుడైన కిచ్చా సుధీప్ తాజాగా ‘పహిల్వాన్’గా మారారు. అవును కిచ్చా సుధీప్ తాజా చిత్రానికి పహిల్వాన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం కోసం మారిన రూపం చూస్తే అందుకోసం ఎంత కసరత్తులు చేశారో, అందుకు ఎంత శ్రమించారో మీకే అర్థం అవుతుంది. ఇక ఈ చిత్రంతో కిచ్చా సుధీప్ మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పహిల్వాన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్ఆర్ఆర్ మోషన్ పిక్చర్స్ పతాకంపై స్వప్నకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఎమోషనల్, కామెడీ అంశాలతో కూడిన క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఒక మల్ల యుద్ధక్రీడాకారుడైన కిచ్చా సుధీప్ ఆ క్రీడలో ఎదుర్కొనే సవాళ్లు, వాటిని ఎలా అధిగమించాడు అన్న కథతో తెరకెక్కిస్తున్న చిత్రం పహిల్వాన్ అని తెలిపారు. దీనికి హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం అని అన్నారు. నటి ఆకాంక్ష కథానాయకిగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నటుడు సుశాంత్ సింగ్, కబీర్ దుహాన్ సింగ్, శరత్ లోకిదాస్, అవినాష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గత జనవరిలో విడుదల చేయగా కిచ్చా సుధీప్ బేర్ బాడీతో కూడిన సన్నివేశాలకు అనూహ్యా స్పందన వచ్చిందని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్ర కథను తెరకెక్కించే ముందే నటుడు కిచ్చాసుధీప్ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని భావించానన్నారు. అలా తాను ఊహించిన దానికంటే నటుడు కిచ్చా సుధీప్ సిక్స్ ప్యాక్, 8 ప్యాక్‌లను మించి తన బాడీని తయారు చేసుకున్నారని దర్శకుడు కృష్ణ చెప్పారు. మరో విశే షం ఏమిటంటే కిచ్చా సుధీప్ బాక్సర్ గెటప్లోని పోస్టర్‌ను ఐదు భాషల్లోని ప్రముఖ నటులు చిరంజీవి తెలుగు పోస్టర్‌ను, హిందీ పోస్టర్‌ను సునీల్ శెట్టి, తమిళ పోస్టర్‌ను విజయ్‌సేతుపతి, మలయాళ పోస్టర్‌ను మోహన్‌లాల్ ఆవిష్కరించారని తెలిపారు. దీనికి అర్జున్ జాన్యా సంగీతాన్ని, కరుణాకర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
పహిల్వాన్‌గా కిచ్చ సుదీప్
స్వప్న కృష్ణ పహిల్వాన్ నేతృత్వంలో నిర్మిస్తున్న పహిల్వాన్. ఈ సినిమాలో కన్నడ హీరో కిచ్చ సుదీప్ పహిల్వాన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో నటించేందుకు ఇప్పటికే కసరత్తులు సైతం చేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి సైతం ఈ సినిమాలో నటిస్తుండటంతో విశేషం. తొలిసారిగా సుదీప్ ఈ సినిమాలో కుస్తీ వీరునిగా, బాక్సర్‌గా అభిమానులను అలరించబోతున్నారు. సినిమాకు ఎస్.కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా అర్జున్ జన్యా సంగీతాన్ని అందిస్తున్నారు. స్టంట్స్ కోసం హాలీవుడ్ నుంచి లార్వెన్ సోహైల్ అనే నిపుణున్ని పిలిపించారు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కబీర్ దుహాన్‌సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఏకంగా 20 సెట్లను రూపొందించారు. -
పల్లెటూరి పహిల్వాన్లు
అమరచింత (కొత్తకోట): స్థానిక చింతల మునీరంగస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సందెరాళ్లు, బల ప్రదర్శన పోటీలు అబ్బుర పరిచాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా నుంచి, మాగనూర్, క్రిష్ణ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు బల ప్రదర్శనలో తమ సత్తా చాటుకున్నారు. రాయచూర్ జిల్లాకు చెందిన తప్పెట్ల మోర్సు గ్రామవాసి కృష్ణ 90 కేజీల బరువుగల రాయిని ఎత్తి రూ.5వేల నగదు బహుమతిని అందుకున్నాడు. అలాగే గట్టుకు చెందిన ఖాజాసాబ్ అనే యువకుడు 235 కేజీల బరువుగల ఇసుక సంచిని అవలీలగా ఎత్తి రెండవ బహుమతిగా రూ.3వేల నగదును అందుకున్నాడు. ఎలాంటి గొడవలు లేకుండా ఎస్ఐ.కె.సత్యనారాయణరె డ్డి ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. -
స్టంట్ హీరో దారా సింగ్...
దారా సింగ్ అంటే రుసుం-ఏ- హింద్. అంతటి పహిల్వాన్ మరొకడు లేడని పేరు. బహుశా అప్పట్లో పండితులు పామరులు అన్న తేడా లేకుండా భారతదేశం అంతటికీ తెలిసిన ఆటగాడు ఇతడొక్కడేనేమో. అమృత్‌సర్‌కు ముప్పై కిలోమీటర్ల దూరంలో పుట్టాడు. ఆరడుగుల 2 అంగుళాల పొడవు, 120 కిలోల బరువు, 53 అంగుళాల విశాలమైన ఛాతీ... పహిల్వాన్‌గా రాణించడానికి ఇంతకుమించి ఏం కావాలి. అయితే దేశంలో ఉండగా ఈ పని సాధ్యం కాలేదు. సింగపూర్‌లో బాబాయి పని చేస్తుంటే అతడితో పాటు వెళ్లి అక్కడ తగిన తిండి దొరికే పరిస్థితి ఏర్పడ్డాక పహిల్వాన్‌గా మారాడు. అప్పటికే ‘హెర్క్యులస్’ వంటి సినిమాలు కలెక్షన్లు కురిపిస్తున్నాయి. ఇండియన్ హెర్క్యులస్ కోసం తమిళ, ఉత్తరాది నిర్మాతలు వెతుకుతున్నారు. దారాసింగ్ వాళ్ల కళ్లల్లో పడ్డాడు. ఎవరో వచ్చి సినిమాల్లో చేస్తావా అడిగితే ‘స్టంట్స్ వరకూ చేస్తాను. యాక్టింగ్‌కు ఇంకొకరిని పెట్టుకోండి’ అన్నాడట. అంతటి అమాయకుడు. హీరో అంటే యాక్టింగు, స్టంట్సు అన్నీ చేయాలి అని ఒప్పించారు. రిటైర్ అయిన పహిల్వాన్లు ఆర్థిక బాధలు పడటం అప్పటికే గమనించిన దారాసింగ్ సినిమాల్లో చేయడం వల్ల నాలుగు డబ్బులు వస్తే చివరి రోజుల్లో పనికొస్తాయని ఒప్పుకున్నాడు. అప్పట్లో ఉర్దూ వాడకం ఎక్కువగా ఉండేది. దారాసింగ్‌కు రాదు. మొదటి నాలుగు సినిమాల్లో డబ్బింగ్ చెప్పించి ఐదో సినిమా నుంచి పూర్తి స్థాయి హీరోని చేశారు. దారాసింగ్ వల్ల కింగ్ కాంగ్, శాంసన్, డాకూ మంగళ్‌సింగ్ వంటి స్టంట్ సినిమాలు ప్రేక్షకులు చూడగలిగారు. ఆయన పక్కన ఎవరూ చేయకపోతే ముంతాజ్ చాలా సినిమాలు చేసి ఆయనను నిలబెట్టింది. దారాకు కుస్తీలో వరల్డ్ చాంపియన్‌షిప్ ఉంది. రాజ్యసభకు నామినేట్ అయిన తొలి ఆటగాడు ఆయన. రామాయణం సీరియల్లో హనుమంతుడిగా వేయడం వల్ల ఆబాలగోపాలానికి మరోమారు దగ్గరయ్యాడు. దారా అంటే భారత్ బలం. కండ. దేహ ధారుడ్యం. 2012లో 83 ఏళ్ల వయసులో మరణించిన ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలిగిన భాగ్యశాలి.