90 కేజీల సందెరాయిని ఎత్తుతున్న క్రీడాకారుడు
అమరచింత (కొత్తకోట): స్థానిక చింతల మునీరంగస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సందెరాళ్లు, బల ప్రదర్శన పోటీలు అబ్బుర పరిచాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా నుంచి, మాగనూర్, క్రిష్ణ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు బల ప్రదర్శనలో తమ సత్తా చాటుకున్నారు. రాయచూర్ జిల్లాకు చెందిన తప్పెట్ల మోర్సు గ్రామవాసి కృష్ణ 90 కేజీల బరువుగల రాయిని ఎత్తి రూ.5వేల నగదు బహుమతిని అందుకున్నాడు.
అలాగే గట్టుకు చెందిన ఖాజాసాబ్ అనే యువకుడు 235 కేజీల బరువుగల ఇసుక సంచిని అవలీలగా ఎత్తి రెండవ బహుమతిగా రూ.3వేల నగదును అందుకున్నాడు. ఎలాంటి గొడవలు లేకుండా ఎస్‌ఐ.కె.సత్యనారాయణరె డ్డి ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment