weight lifting competion
-
నన్నయ్య వర్సిటీ ఆధ్వర్యంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
-
తెలంగాణ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు.. గోల్డ్ మెడల్ సాధించిన సురేష్
వయసు పెరిగినా తమలో క్రీడా నైపుణ్యం తగ్గలేదని ఆ అథ్లెట్లు నిరూపించారు. 40 ఏళ్ల పైబడిన వయసులోనూ వెయిట్ లిఫ్టింగ్ లో అదరగొట్టారు. హైదరాబాద్‌లోని పోస్టల్ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన మొట్ట మొదటి మాస్టర్స్ స్టేట్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్, సౌత్ ఇండియా మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పలు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటారు. తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర షిప్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కె.కిషోర్ గౌడ్ హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల నుంచి మాస్టర్ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో 30 నుంచి 80 వయస్సు కలిగిన అథ్లెట్లకు ఈ పోటీలు నిర్వహించారు. చాంపియన్స్‌గా సురేష్..శ్వేత పురుషుల విభాగంలో 9 కేటగిరీల్లోనూ, మహిళల విభాగంలో 10 కేటిగిరీల్లోనూ పోటీలు జరిగాయి. 30 ఏళ్ల వయస్సు తర్వాత కూడా క్రీడల్లో రాణించే అథ్లెట్లను ప్రోత్సహించేందుకే ఈ పోటీలను నిర్వహించినట్టు ఈవెంట్ నిర్వహకులు వెల్లడించారు.81 కిలోల పురుషుల విభాగంలో కే సురేష్ స్వర్ణం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. మహిళల 76 కేజీల విభాగంలో శ్వేత స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. -
ప్రపంచంలోనే బలమైన బాలిక
అమెరికాలోని ఒట్టోవా నగరానికి చెందిన రోరి వ్యాన్ ఉల్ఫిట్కు సరిగ్గా ఏడేళ్లు. ఏకంగా 80 కిలోల బరువును తేలిగ్గా లేపుతుంది. ఇటీవల జరిగిన అమెరికా జాతీయ చాంపియన్ షిప్ అండర్ 11, అండర్ 13 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడంతోపాటు 80 కిలోల బరువును ఎత్తే అతి పిన్న వయస్కురాలిగా ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. ఆ పాప 61 కిలోల బరువుతో స్క్వాట్స్ (మోకాళ్ల మీద కూర్చొని లేవడం) చేయగలదు. రోరి వ్యాన్ తన ఐదవ ఏటనే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడానికి క్లాస్‌లకు వెళ్లింది. ఓ పక్క జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటూనే మరో పక్క వెయిటిలిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసింది. ఇప్పటికీ ఆ పాప వారానికి తొమ్మిది గంటలపాటు జిమ్నాస్టిక్స్, నాలుగు గంటలపాటు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ రెండు క్రీడల ప్రాక్టీస్, పోటీల సందర్భంగా పాపకు ఎలాంటి గాయాలు కాకుండా కోచ్‌లతోపాటు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. -
పల్లెటూరి పహిల్వాన్లు
అమరచింత (కొత్తకోట): స్థానిక చింతల మునీరంగస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన సందెరాళ్లు, బల ప్రదర్శన పోటీలు అబ్బుర పరిచాయి. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా నుంచి, మాగనూర్, క్రిష్ణ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు బల ప్రదర్శనలో తమ సత్తా చాటుకున్నారు. రాయచూర్ జిల్లాకు చెందిన తప్పెట్ల మోర్సు గ్రామవాసి కృష్ణ 90 కేజీల బరువుగల రాయిని ఎత్తి రూ.5వేల నగదు బహుమతిని అందుకున్నాడు. అలాగే గట్టుకు చెందిన ఖాజాసాబ్ అనే యువకుడు 235 కేజీల బరువుగల ఇసుక సంచిని అవలీలగా ఎత్తి రెండవ బహుమతిగా రూ.3వేల నగదును అందుకున్నాడు. ఎలాంటి గొడవలు లేకుండా ఎస్ఐ.కె.సత్యనారాయణరె డ్డి ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. -
జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక
సత్తెనపల్లి: జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో సబ్‌జైలు ఎదుట గల ఎస్ఆర్ఎన్ జిమ్‌కు చెందిన పసుపులేటి సురేష్, జి.రమేష్ ఎంపికైనట్లు ఎస్ఆర్ఎన్ జిమ్ నిర్వాహకుడు రాజు శుక్రవారం తెలిపారు. సురేష్, రమేష్‌లను సీనియర్లు పార్థ సారథి, ఆనంద్, తిరుపతి నాయుడులు అభినందించారు.