వయసు పెరిగినా తమలో క్రీడా నైపుణ్యం తగ్గలేదని ఆ అథ్లెట్లు నిరూపించారు. 40 ఏళ్ల పైబడిన వయసులోనూ వెయిట్ లిఫ్టింగ్ లో అదరగొట్టారు. హైదరాబాద్‌లోని పోస్టల్ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన మొట్ట మొదటి మాస్టర్స్ స్టేట్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్, సౌత్ ఇండియా మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ లో పలు రాష్ట్రాల క్రీడాకారులు సత్తా చాటారు.
తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్, రాష్ట్ర షిప్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కె.కిషోర్ గౌడ్ హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల నుంచి మాస్టర్ అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల, మహిళల విభాగాల్లో 30 నుంచి 80 వయస్సు కలిగిన అథ్లెట్‌లకు ఈ పోటీలు నిర్వహించారు.
చాంపియన్స్‌గా సురేష్..శ్వేత
పురుషుల విభాగంలో 9 కేటగిరీల్లోనూ, మహిళల విభాగంలో 10 కేటిగిరీల్లోనూ పోటీలు జరిగాయి. 30 ఏళ్ల వయస్సు తర్వాత కూడా క్రీడల్లో రాణించే అథ్లెట్లను ప్రోత్సహించేందుకే ఈ పోటీలను నిర్వహించినట్టు ఈవెంట్ నిర్వహకులు వెల్లడించారు.81 కిలోల పురుషుల విభాగంలో కే సురేష్ స్వర్ణం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. మహిళల 76 కేజీల విభాగంలో శ్వేత స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment