సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీపై దాడి చేసిన మహమ్మద్ పహిల్వాన్ మంగళవారం మృతి చెందారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్బరుద్ధీన్‌పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన పహిల్వాన్ బెయిల్‌పై బయట ఉంటున్న విషయం తెలిసిందే.
ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో అక్బరుద్ధీన్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. పలు కత్తిపోట్లకు గురయ్యారు. ఆ సమయంలో అక్బరుద్దిన్ శరీరంలో నుంచి డాక్టర్లు కేవలం ఒకే బుల్లెట్ తీశారు. దీంతో ఆయన శరీరంలో ఉన్న మరో బుల్లెట్ కారణంగా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. అక్బరుద్ధీన్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి విదితమే.
Comments
Please login to add a commentAdd a comment