మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్.. సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య విడుదల కానుంది. ఆ రోజు మెగా అభిమానులకు పండుగ చేసుకోనున్నారు. ఆచార్యలో హీరో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధ అనే పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. దీనికి సంబంధించిన చిత్రీకరణలోనిప్పటికే చరణ్ జాయిన్ అయ్యారు. చరణ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. వచ్చే వారంలో చిరంజీవి–చరణ్ కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ ఆరంభమవుతుందని సమాచారం. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో చందమామ కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
చదవండి: ‘ఆచార్య’గా మారిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్
తాజాగా ఆచార్యలో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ నటుడు కిచ్చా సుదీప్ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్ల తెలుస్తోంది. అయితే సుదీప్ తెలుగు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే నాని హీరోగా వచ్చిన ఈగ సినిమాలో ప్రతినాయకుడిగా మెప్పించిన సుదీప్ ఆ తరువాత ప్రభాస్ నటించిన బాహుబలిలోనూ ఓ పాత్ర పోషించారు. అంతేగాక చిరంజీవి సైరా నర్సింహరెడ్డి సినిమాలో కూడా సుదీప్ ఓ కీలక పాత్ర చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆచార్యలో కూడా నటించాల్సిందిగా సినిమా యూనిట్ కోరడంతో.. నటించేందుకు సుదీప్ ఒకే చెప్పినట్లు వినికిడి. కాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించలేదు. చదవండి: బాక్సాఫీస్ వార్: చిరు Vs బాలయ్య.. సై అంటున్న వెంకీ
Comments
Please login to add a commentAdd a comment