
‘ఈగ’ ఫేమ్ సుదీప్ హీరోగా నటించిన చిత్రం ‘కే3: కోటికొక్కడు’. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించారు. కన్నడంలో ‘కే3’ పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం ‘కే3: కోటికొక్కడు’ పేరుతో నవంబర్ 12న తెలుగులో విడుదల కానుంది. స్పందన పాశం, శ్వేతన్ రెడ్డి సమర్పణలో శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే విడుదల చేస్తున్నారు.
బుధవారం ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. కన్నడంలో ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు సాధించింది. సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. యాక్షన్ మూవీ లవర్స్‌ను మా సినిమా కచ్చితంగా అలరిస్తుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment