అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపే, జేడీఎస్ వంటి పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నడుస్తోంది. వివిధ పార్టీల నుంచి నేతలను ఆకర్షించడంతోపాటు.. సినీ తారలను కూడా తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు, కమలం గుర్తు తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. ఇందుకు సుదీప్ బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్ సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర నేతలతో సమావేశమవ్వడమే కారణం. తాజాగా ఈ వార్తలపై సుదీప్ స్పందించారు. తాను బీజేపీ తరపున కేవలం ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని తెలిపారు.
పార్టీలో చేరడం లేదని, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుదీప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం బొమ్మైతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిపై ఉన్న అభిమానం, గౌరవంతో బీజేపీ తరపున ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జీవితంలో చాలాసార్లు సాయం చేశారని.. దానికి కృతజ్ఞతగా తాను ఈ విధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇది పార్టీ కోసం కాదని చెప్పారు.
‘జీవితంలో నాకు చాలా మంది నాకు అండగా నిలిచారు. ఎంకరేజ్ చేశారు. వారిలో సీఎం బొమ్మై ఒకరు. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే ఆయన కోసమే. పార్టీ కోసం కాదు’ అని తెలిపారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేయడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని ఇప్పటికే సీఎంకు చెప్పిన్నట్లు పేర్కొన్నారు. కాగా వచ్చేనెల 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వెలువడుతాయి.
చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీపై పిటిషన్ తిరస్కరణ..
Comments
Please login to add a commentAdd a comment