Kabzaa Twitter Review: Check Out These Tweets Before You Watch - Sakshi
Sakshi News home page

Kabzaa Twitter Review: కబ్జ ట్విటర్‌ రివ్యూ

Published Fri, Mar 17 2023 9:14 AM | Last Updated on Fri, Mar 17 2023 10:24 AM

Kabzaa Movie Twitter Review In Telugu - Sakshi

కన్నడ స్టార్స్‌ ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కబ్జ’.  కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియా శరణ్‌ హీరోయిన్‌గా నటించింది.  పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతి పురస్కరించుకొని నేడు(మార్చి 17) తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై అంచాలను పెంచేసింది. 

కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో కబ్జ ఒకటి. కేజీయఫ్‌ తరహాలో గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. దీంతో యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారితో పాటు ఉపేంద్ర ఫ్యాన్స్‌  కబ్జ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసినవాళ్లు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘కబ్జ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను సోషల్‌ మీడియాలో చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.

కన్నడ నుంచి వచ్చిన మరో బ్లాక్‌బస్టర్‌ చిత్రం కబ్జ. చంద్రు డైరెక్షన్‌ అదిరిపోయింది. ఉపేంద్ర యాక్టింగ్‌ నెక్ట్‌లెవల్‌. కిచ్చా సుదీప్‌ స్క్రీన్‌ ఫెర్మార్మెన్స్‌ బాగుంది. శివరాజ్‌కుమార్‌ ఎంట్రీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. మొత్తంగా 2023లో మొదటి బ్లాక్‌ బస్టర్‌గా కబ్జ నిలుస్తుందని చెబుతూ 4.5 రేటింగ్‌ ఇచ్చాడు ఓ నెటిజన్‌. 

కబ్జ అస్సలు బాగాలేదు. కేజీయఫ్‌ 1,2 చూసినవాళ్లు కబ్జను అవైడ్‌ చేయ్యొచ్చు. కేజీయఫ్‌కి చీప్‌ వెర్షన్‌ ఈచిత్రం. అదే తరహా స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌. ఉపేం‍ద్ర నటన కూడా అంతగా ఆకట్టుకోలేకపోయిదంటూ 2 రేటింగ్‌ ఇచ్చాడు మరో నెటిజన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement