Kannada Hero Upendra Talks About 'Kabzaa' Movie - Sakshi
Sakshi News home page

నా నుంచి ‘ఉపేంద్ర’ లాంటి సినిమా ఆశిస్తున్నారు: ఉపేంద్ర

Mar 15 2023 10:21 AM | Updated on Mar 15 2023 11:36 AM

Kannada Hero Upendra Talk About Kabzaa Movie - Sakshi

‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కబ్జ’. సెంటిమెంట్‌ కూడా ఉంది. విజువల్‌ గ్రాండియర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని హీరో ఉపేంద్ర అన్నారు. ఆర్‌.చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ఇది. శ్రియా శరణ్‌ హీరోయిన్‌. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతి సందర్భంగా ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలవుతోంది. నిర్మాత ఎస్‌.. సుధాకర్‌ రెడ్డి సమర్పణలో లక్ష్మీకాంత్‌ రెడ్డి తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. 

హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఉపేంద్ర మాట్లాడుతూ– ‘‘నా నుంచి ‘ఉపేంద్ర’ లాంటి సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. నేను హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ‘యుఐ’ సినిమా ‘ఉపేంద్ర’ లాగే ఉంటుంది’’ అన్నారు. ‘‘కబ్జ’ నా మనసుకి ఎంతో దగ్గరైన చిత్రం’’ అన్నారు శ్రియ. ‘‘ఉపేంద్రగారి ‘బుద్ధిమంతుడు’ చిత్రాన్ని తెలుగులో నేనే విడుదల చేశాను. ఇప్పుడు మళ్లీ ‘కబ్జ’ తో రీ ఎంట్రీ ఇస్తున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్‌ రెడ్డి. చిత్ర సహనిర్మాత ‘ఆర్కా’ సాయికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement