కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి 'కబ్జ' చిత్రానికి అభినందనలు | Union Finance Ministry Appreciation To Kabza Movie Producer | Sakshi
Sakshi News home page

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి 'కబ్జ' చిత్రానికి అభినందనలు

Published Tue, Jul 2 2024 12:44 PM | Last Updated on Tue, Jul 2 2024 1:00 PM

Union Finance Ministry Appreciation To Kabza Movie Producer

కన్నడలో భారీగా ప్రేక్షకాధరణ పొందిన చిత్రం 'కబ్జ'.  ఇందులో ఉపేంద్ర , సుదీప్‌ , శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటించారు. మల్టీస్టారర్‌ చిత్రంగా 2023 మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. కన్నడ దర్శకుడు ఆర్‌ చంద్రు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు.  ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయనప్పటికీ నష్టాలు అయితే రాలేదు. అయితే, తాజాగా ఈ సినిమా నిర్మాత, దర్శకుడు అయిన ఆర్‌. చంద్రుని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రంతో సత్కరించింది.

శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై కబ్జ సినిమాను ఆర్‌. చంద్రు నిర్మించారు. పెద్దగా లాభాలు రాకపోయినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌ను పూర్తిగా ఆయన క్లియర్‌ చేశాడు. దీంతో ఆర్.చంద్రు నిర్మాణ సంస్థకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రశంసా పత్రం జారీ చేసింది. పన్ను బకాయిలు పెట్టకుండా ఆ శాఖకు రికార్డు స్థాయిలో డబ్బు చెల్లించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రశంసా పత్రాన్ని ఆయన అందుకున్నారు. ఆర్.చంద్రు నిర్మించి, దర్శకత్వం వహించిన 'కబ్జా' దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. ఈ సినిమా నిర్మాత శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్‌కి ఇప్పుడు అత్యధిక పన్ను కట్టిన ఘనత దక్కింది.

ఈ బ్యానర్‌పై ఐదు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.చంద్రు కన్నడ సక్సెస్‌ఫుల్ దర్శకుల్లో ఒకరిగా పేరు పొందారు. చిక్కబళ్లాపూర్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రు ఈరోజు సినీ ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఈ కాలంలో దర్శకుడిగా విజయం సాధించడం అనేది చాలెంజింగ్‌తో కూడుకున్న పని. అయినప్పటికీ, అతను ప్రేక్షకుల ప్రశంసలు పొందిన చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించాడు. తమ సొంత బ్యానర్ ద్వారా కూడా కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు.

ఇటీవల జరిగిన కన్నడ సినీ అవార్డ్స్‌లో 'కబ్జా' ఉత్తమ VFX పోస్ట్ ప్రొడక్షన్, యానిమేషన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. 1960 కాలం నేపథ్యంలో సాగే కథతో ఈ కబ్జ చిత్రాన్ని తెరకెక్కించారు.  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement