కన్నడ స్టార్స్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కబ్జ’. కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శ్రియాశరణ్ హీరోయిన్‌గా నటించింది. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా మార్చి 17న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. కేజీఎఫ్, కాంతార హిట్ చిత్రాల్లాగే అలరిస్తుందని ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. కానీ ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది ఈ చిత్రం.
అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. ‘కబ్జ’ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే కబ్జ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. థియేటర్లో చూడడం మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment