కన్నడ దివంగత స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పరిచయం అక్కర్లేని పేరు. అయితే ఆయన కెరీర్‌లో చివరిసారిగా నటించిన చిత్రం గంధడ గడ. డాక్యుమెంటరీగా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో రిలీజై ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ చిత్రం మొదట అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆ తర్వాత లైసెన్స్ గడువు ముగియడంతో తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి అమెజాన్ ఈ మూవీని తొలగించింది. దీంతో పునీత్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
(ఇది చదవండి: పునీత్ రాజ్‌కుమార్ రెండో వర్థంతి.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్)
అయితే అమెజాన్‌లో తొలగించినా.. గంధడ గడ మూవీ మరికొన్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం యూట్యూబ్, గూగుల్ టీవీ, ఐట్యూన్స్, యాపిల్ టీవీల్లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను వీక్షించాలనుకుంటే...రూ.100 అద్దె చెల్లించి చూసేయొచ్చు. ఈ డాక్యుమెంటరీని కర్ణాటక రాష్ట్ర అడవులు, ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించారు. ఈ డాక్యూమెంటరీ ఫిల్మ్ లో నటిస్తూనే స్వయంగా నిర్మించారు పునీత్ రాజ్‌కుమార్.
కాగా.. పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు. ఆయన మరణానంతరం మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్ స్వీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment