దీనికి నేను రెడీ.. మీరు రెడీనా అంటున్న శ్రియ | Shriya Saran Starts Second Innings In Film Career | Sakshi
Sakshi News home page

Shriya Saran: దీనికి నేను రెడీ.. మీరు రెడీనా అంటున్న శ్రియ

Published Fri, Sep 29 2023 6:46 AM | Last Updated on Fri, Sep 29 2023 10:30 AM

Shriya Saran Start Second Innings In Film Career - Sakshi

2001లో ఇష్టం అనే చిత్రంతో హీరోయిన్‌గా తన నటజీవితాన్ని ప్రారంభించిన ఉత్తరాది భామ శ్రియ. ఆ తరువాత నువ్వే నువ్వే చిత్రంతో తొలివిజయాన్ని అందుకున్నారు. అదేవిధంగా తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇలా తమిళం, తెలుగు భాషల్లో అగ్ర కథానాయకులతో జతకట్టి స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. 

(ఇదీ చదవండి: హెచ్చరించినా తీరు మార్చుకోని శివాజీ.. పంపించేస్తే బెటర్!)

ముఖ్యంగా తమిళంలో జయంరవి, ధనుష్‌, విజయ్‌ వంటి హీరోల సరసన నటించినా, రజనీకాంత్‌ సరసన శివాజీ చిత్రంలో నటించిన తరువాత అగ్ర కథానాయికల వరుసలో చేరారు. తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి ప్రముఖ హీరోలతో జతకట్టారు. అదేవిధంగా హిందీ, కన్నడం భాషల్లో నటించి బహు భాషా నటిగా పేరు గాంచారు. అలా కథానాయకిగా పుల్‌ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో అడుగుపెట్టారు. అలా చిన్నగ్యాప్‌ తర్వాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారు.

ఇటీవల కబ్జా అనే కన్నడ చిత్రంలో కథానాయకిగా నటించారు. మ్యూజిక్‌ స్కూల్‌ అనే పాన్‌ ఇండియా చిత్రంలో నటించి ప్రశంసలు అందుకున్నారు. గత 22 ఏళ్లుగా సినీ రంగంలో కథానాయకిగా కొనసాగుతున్న శ్రియ ఏ మాత్రం తరగని అందాలతో అభిమానుల చేత వావ్‌ ఏమి బ్యూటీ అనిపించుకుంటున్నారు. ఇప్పటికి తనకే సొంతమైన అందాలతో రీఎంట్రీకి సిద్ధమయ్యారు. వెవిధ్యభరిత కథా పాత్రల కోసం ఎదురుచూస్తున్నట్లు శ్రియ వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా ఆమె సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసిన ఫొటోలు యువతను అలరిస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్‌ త్రిష తన రీ ఎంట్రీలో అదరగొడుతుంది. అలాగే శ్రియకు ఒక్క మంచి ఛాన్స్‌ దొరికితే మళ్లీ తన అందాలతో రెచ్చిపోవడం ఖాయం అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement