ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్‌ | Kiccha Sudeep Gives Clarity On RRR Movie | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై క్లారిటీ ఇచ్చిన సుదీప్‌

Published Sun, Jan 19 2020 1:05 PM | Last Updated on Sun, Jan 19 2020 1:22 PM

Kiccha Sudeep Gives Clarity On RRR Movie - Sakshi

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ బడ్జెట్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు స్పందించిన ఓ వార్తపై కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ స్పందించారు. రాజమౌళి సినిమాలో సుదీప్‌ ఉన్నారంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సుదీప్‌ తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నేను నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలు విని సంతోషం వ్యక్తం చేసిన వారికి ఓ విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు విన్న ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. సినిమాకు సంబంధించి నాతో ఎవరూ ఎటువంటి సంప్రదింపులు కూడా జరపలేదంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో సుదీప్ నటించిన విషయం తెలిసిందే. రాజమౌళి బహుబలి-2 తర్వాత తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్‌ తెలంగాణా యోధుడు కొమరం భీంగా, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్‌కి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్, ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement