Karnataka Polls: Kannada Movie Stars Kiccha Sudeep, Darshan Likely To Join BJP - Sakshi
Sakshi News home page

బీజేపీలోకి కిచ్చా సుదీప్‌, దర్శన్‌.. ఎన్నికల కోసం స్టార్‌ క్యాంపెయినర్లుగా..

Published Wed, Apr 5 2023 8:15 AM | Last Updated on Wed, Apr 5 2023 9:11 AM

Kiccha Sudeep Darshan to be BJP star campaigner For Karnataka Polls - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సినీ గ్లామర్‌ను వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో.. పలువురు తారలు  రాజకీయ పార్టీల కండువాలు కప్పుకుంటున్నా కూడా. తాజాగా కన్నడ స్టార్‌ హీరోలు సుదీప్‌, దర్శన్‌లు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

బుధవారం మధ్యాహ్న సమయంలో కర్ణాటకలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో వీళ్లు బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సమక్షంలోనే వీళ్లు పార్టీ కండువాలు కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో స్టార్‌ క్యాంపెయినర్‌లుగా వీళ్లిద్దరూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పని చేస్తారని సమాచారం.

‘కిచ్చా’ సుదీప్‌ నాయక(ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ సుదీప్‌ను పార్టీలోకి తీసుకుంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఛాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ గతంలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నాడు కూడా. 2020లో ఆర్‌ఆర్‌ నగర్‌ ఉప ఎన్నిక సమయంలో బీజేపీ అభ్యర్థి మునిరత్న కోసం దర్శన్‌ ప్రచారం నిర్వహించారు.  ఆపై అంబరీష్‌ మరణం తర్వాత.. జరిగిన మాండ్యా లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో స్వతంత్ర సుమలత అం‍బరీష్‌కు మద్దతు ప్రకటించాడు దర్శన్‌. తాజాగా.. సుమలత బీజేపీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితా ఒకటి చక్కర్లు కొడుతుండగా.. అది ఫేక్‌ అని బీజేపీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. మే 10వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరుగుతుండగా.. 13వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement