
రక్షిత్ శెట్టి, శాన్వి
రక్షిత్ శెట్టి, శాన్వి జంటగా నూతన దర్శకుడు సచిన్ తెరకెక్కించిన చిత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’. పుష్కర్ ఫిలింస్ పతాకంపై పుష్కర్ మల్లికార్జున్, హెచ్.కె. ప్రకాశ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ‘దిల్’ రాజు తెలుగులో జనవరి 1న విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రక్షిత్‌శెట్టి మాట్లాడుతూ– ‘‘నిధి అన్వేషణ నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది. మూడేళ్లు కష్టపడి ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా చేశాం. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో వంశీకృష్ణ అనే మిత్రుడి ద్వారా తెలుగుతో పరిచయం ఏర్పడింది.
అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌గార్ల సినిమాలు చూసేవాణ్ణి. తెలుగు ప్రజలకు సినిమా అనేది సంస్కృతిలో ఓ భాగం. ఇక్కడి ప్రేక్షకులు సినిమాని ఎలా ఆదరిస్తారో? ప్రేమిస్తారో తెలిసింది. అందుకే మా సినిమాని తెలుగులోనూ విడుదల చేస్తున్నాం. రామజోగయ్యశాస్త్రిగారు నాలుగు పాటలకు మంచి సాహిత్యం అందించారు’’ అన్నారు. ‘‘ఐదేళ్ల తర్వాత ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రహస్యాలతో కూడిన ఫ్యాంటసీ కథ ఇది. కొంత ఆలస్యమైనా మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా’’ అన్నారు శాన్వీ. ‘‘ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సమావేశంలో పంపిణీదారుడు సతీష్, బాలాజీ మనోహర్, ప్రమోద్ శెట్టి, ఇమ్రాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment