శాన్వి బ్యూటీకి పడిపోయిన సంచలన డైరెక్టర్ | Sanvi acts in a sensational director cinema | Sakshi
Sakshi News home page

శాన్వి బ్యూటీకి పడిపోయిన సంచలన డైరెక్టర్

Published Sat, Mar 8 2014 9:22 PM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

హీరోయిన్  శాన్వి - Sakshi

హీరోయిన్ శాన్వి

 శాన్వి బ్యూటీకి ఓ సంచలన డైరెక్టర్ పడిపోయాడట. ఇంతకీ ఈ శాన్వి ఎవరు? ఆ సంచలన డైరెక్టర్ ఎవరు? లవ్లీ సినిమాతో తెరంగేట్రం చేసిన  ముద్దుగుమ్మ శాన్వికి అవకాశాలమీద అవకాశాలు వచ్చిపడుతున్నాయి. లవ్లీ చిత్రంలో హీరోయిన్గా నటించిన  శాన్వి అందాలకు ముగ్ధుడు కాని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. జీరో సైజ్ ఫిగర్ - నాజూకు నడుం - కళ్లుచెదిరే అందాలు... కుర్రకారుని పిచ్చెక్కించింది. అందంతోపాటు మంచి నటన ప్రదర్శించింది.  మొదటి చిత్రంతోనే ఈ బ్యూటీ టాలీవుడ్లో మంచి పేరు సంపాదించింది.

 'లవ్‌లీ' చిత్రంలో శాన్వి ఆదికి జంటగా నటించింది. ఆ తరువాత హీరో సుశాంత్ సరసన అడ్డాలో నటించింది. మళ్లీ ఆది హీరోగా నటించే  'ప్యార్ మే పడిపోయానే' చిత్రంలో నటిస్తోంది.  ఈ అమ్మడు నటించిన చిత్రాల హిట్-ఫ్లాప్లతో సంబంధంలేకుండా ఛాన్స్లు కొట్టేస్తోంది. అందానికి తోడు రెమ్యూనరేషన్ విషయంలో చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉంటడంతో అవకాశాలు వాటంతట అవే వస్తున్నాయి. మరో రెండు సినిమాలలో కూడా నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

అవకాశాలే కాకుండా తను నటించాలని కలలు కన్న డైరెక్టర్ చిత్రంలో కూడా నటించే అవకాశం దక్కిచ్చుకుంది.  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించాలని ఈ అందాల బొమ్మ కలట. రామ్గోపాల్ వర్మ ఈ మధ్య ఈ బ్యూటీ నటించిన తెలుగు సినిమాలు చూసి, ఆ అందానికి పడిపోయాడట. అంతే ఇంకేముంది శాన్వికి తన చిత్రంలో ఛాన్స్ ఇచ్చేశారు. ఊహించని అవకాశం. తన స్వప్నం నెరవేరడంతో  శాన్వి ఆనందానికి అవధులులేవు. రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందే రౌడీ సినిమాలో  విష్ణుకి జోడీగా శాన్వి ఎంపికైంది.

హీరోయిన్ల బ్యూటీని గుర్తించడంలో, వారిని అందంగా, అద్భుతంగా చూపించడంలో వర్మ దిట్ట. ప్రఖ్యాత దర్శకుడు బాపు హీరోయిన్ను ఒక రకంగా చూపిస్తే, వర్మ మరో రకంగా చూపిస్తారు. ప్రిన్స్ మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో  నిర్మిస్తున్న చిత్రంలో కూడా  శాన్విని తీసుకోబోతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement