టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్ కిచెన్'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్‌ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్ కిచెన్' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్‌లైన్‌లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.
తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు.
దీంతో అత్తమ్మాస్ కిచెన్ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్‌గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment