
సినిమా: బాక్సరమ్మా ఏమిటీ వాలకమమ్మా? అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతగా విమర్శంచడానికి ఆమె ఏం చేసిందనేగా మీ ప్రశ్న. ఆ కథేంటో చూద్దాం రండి. రియల్ బాక్సర్ అయిన రితికాసింగ్ ఇరుదిచుట్రు చిత్రంతో కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అందులో నిజ జీవిత వృత్తి అయిన బాక్సర్‌గానే నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు అదే చిత్ర తెలుగు రీమేక్‌లోనూ నటించి అక్కడ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ తరువాత కోలీవుడ్‌లో ఆండవన్ కట్టళై, శివలింగ వంటి చిత్రాల్లోనూ నటించే అవకాశాలను అందుకుంది. ఆ చిత్రాలు పర్వాలేదనిపించుకున్నాయి. అయినా రితికకు ఎందుకనే పెద్దగా క్రేజ్ రాలేదు.
అలా 2017 తరువాత ఈ అమ్మడు నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. అసలు అవకాశాలు కూడా లేవు. దాదాపు రెండేళ్లు ఖాళీగా ఉన్న రితికాసింగ్‌కు ఇటీవలే వణంగాముడి అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అదీ నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించే పాత్ర. కాగా ఇప్పటి వరకూ తన నటించిన చిత్రాల్లో దాదాపు గ్లామర్‌కు దూరంగా నటించి మెప్పించింది. అయితే అదే తనకు మైనస్ అనుకుందో ఏమోగానీ, ఆ ఇమేజ్‌ను పోగొట్టడానికన్నట్టుగా చిన్న చిన్న పీసులను ఒంటికి చుట్టుకున్నట్లు దిగిన ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది. చాలా గ్లామరస్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా బాక్సరమ్మా ఈ దుస్తులేమిటి? ఈ వాలకం ఏమిటి? అంటూ నెటిజన్ల విమర్శల దాడి చేస్తున్నారు. అయితే రితికాసింగ్ కోరుకుంది ఇదేనేమో..ఈ అమ్మడు ఏం స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment