పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నా సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని భావించారు. అయితే అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ దూసుకుపోతుంది జెస్పీ. స్టార్ హీరోల సరసన జత కడుతూ హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటి అభిమానులకు మరో స్వీట్ షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత వస్త్రాల ప్రచార బాధ్యతను తీసుకున్న సమంత, జేఎఫ్డబ్ల్యూ మేగజైన్ కోసం ఓ ఫొటో షూట్ చేసింది. చేనేత వస్త్రాల్లోనే కనిపించినా.. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది. త్వరలో అక్కినేని ఇంటికోడలు అవుతున్న ఈ బ్యూటి ఇంత గ్లామరస్ ఫొటో షూట్ చేయటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు కూడా సరికొత్త గ్లామర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.