JFW Magazine
-
JFW Movie Awards: జేఎఫ్డబ్ల్యూ అవార్డ్స్ ఈవెంట్లో సినీతారల సందడి (ఫొటోలు)
-
‘మామ్ కాలింగ్’
సాక్షి, హైదరాబాద్: మాతృదినోత్సవం సందర్భంగా యూ ట్యూబ్లో ‘మామ్ కాలింగ్’ వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టకుంటోంది. మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సౌత్ ఇండియన్ లీడింగ్ విమెన్స్ మ్యాగజైన్ ‘జస్ట్ ఫర్ విమెన్’ ఒక వీడియోను రిలీజ్ చేసింది. మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ్మను మించిన ప్రయారిటీ మనకు మరేముంటుందనే సందేశంతో ఉన్న ఈ వీడియో పలువురి నెటిజనులతో సహా, సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ వీడియోను లాంచ్ చేసిన ప్రముఖ హీరో సూర్య, టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ తదితరులు ఈ వీడియోను ట్విటర్లో పంచుకున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జన్మనిస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టయినా బిడ్డలను కాపాడుకుంటుంది. జీవితాంతం ఇదే అనుబంధం అమ్మసొంతం. సృష్టిలో ఏ జీవికైనా ఇంతకంటే ఏం కావాలి..అయితే..ఈ స్పూర్తిని, ప్రేమను మదర్స్ డే పేరుతో ఏదో ఒక రోజుకు పరిమితం చేయడం న్యాయమా అనే వాదన ఉన్నప్పటికీ...అమ్మ బిడ్డల పట్ల చూపించే , ఆప్యాయత, ఆదరణను, బిడ్డలు కూడా చూపించడం న్యాయం. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. మన తొలి ప్రాధాన్యత అమ్మదే.. ఇదే ఈ వీడియో సారాంశం.... అందుకోండి మరి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను ప్రేమించండి...ఎప్పటికీ.. అచ్చం అమ్మలాగే! -
నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘మామ్ కాలింగ్’
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా సమంత ఫొటో షూట్
పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నా సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని భావించారు. అయితే అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ దూసుకుపోతుంది జెస్పీ. స్టార్ హీరోల సరసన జత కడుతూ హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటి అభిమానులకు మరో స్వీట్ షాక్ ఇచ్చింది. రెండు నెలల క్రితం సమంత జేఎఫ్డబ్ల్యూ మేగజైన్ కోసం ఓ ఫొటో షూట్ చేసింది అయితే అప్పట్లో కవర్ పేజ్ కు సంబంధించిన ఒకటి రెండు ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. తాజాగా ఈ ఫొటోషూట్ కు సంబంధించిన మరిన్ని ఫోటోలు ఆన్ లైన్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటో షూట్ లో చేనేత వస్త్రాల్లోనే కనిపించినా.. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది. కుర్రాళ్ల మతులు పొగొట్టే స్క్రిన్ షోతో సమంత చేసిన షూట్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది. త్వరలో అక్కినేని ఇంటికోడలు అవుతున్న ఈ బ్యూటి ఇంత గ్లామరస్ ఫొటో షూట్ చేయటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు కూడా సరికొత్త గ్లామర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. -
షాక్ ఇస్తున్న సమంత ఫొటోషూట్
పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నా సమంత గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని భావించారు. అయితే అలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ దూసుకుపోతుంది జెస్పీ. స్టార్ హీరోల సరసన జత కడుతూ హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటి అభిమానులకు మరో స్వీట్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత వస్త్రాల ప్రచార బాధ్యతను తీసుకున్న సమంత, జేఎఫ్డబ్ల్యూ మేగజైన్ కోసం ఓ ఫొటో షూట్ చేసింది. చేనేత వస్త్రాల్లోనే కనిపించినా.. హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది. త్వరలో అక్కినేని ఇంటికోడలు అవుతున్న ఈ బ్యూటి ఇంత గ్లామరస్ ఫొటో షూట్ చేయటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు కూడా సరికొత్త గ్లామర్ వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది.