
సాక్షి, హైదరాబాద్: మాతృదినోత్సవం సందర్భంగా యూ ట్యూబ్‌లో ‘మామ్ కాలింగ్’ వీడియో ఒకటి నెటిజనులను ఆకట్టకుంటోంది. మే నెలలో వచ్చే రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సౌత్ ఇండియన్ లీడింగ్ విమెన్స్ మ్యాగజైన్ ‘జస్ట్ ఫర్ విమెన్’ ఒక వీడియోను రిలీజ్ చేసింది. మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన అమ‍్మను మించిన ప్రయారిటీ మనకు మరేముంటుందనే సందేశంతో ఉన్న ఈ వీడియో పలువురి నెటిజనులతో సహా, సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ వీడియోను లాంచ్ చేసిన ప్రముఖ హీరో సూర్య, టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ తదితరులు ఈ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జన్మనిస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టయినా బిడ్డలను కాపాడుకుంటుంది. జీవితాంతం ఇదే అనుబంధం అమ్మసొంతం. సృష్టిలో ఏ జీవికైనా ఇంతకంటే ఏం కావాలి..అయితే..ఈ స్పూర్తిని, ప్రేమను మదర్స్ డే పేరుతో ఏదో ఒక రోజుకు పరిమితం చేయడం న్యాయమా అనే వాదన ఉన్నప్పటికీ...అమ్మ బిడ్డల పట్ల చూపించే , ఆప్యాయత, ఆదరణను, బిడ్డలు కూడా చూపించడం న్యాయం. ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. మన తొలి ప్రాధాన్యత అమ్మదే.. ఇదే ఈ వీడియో సారాంశం....
అందుకోండి మరి మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను ప్రేమించండి...ఎప్పటికీ.. అచ్చం అమ్మలాగే!
Comments
Please login to add a commentAdd a comment