![Aadhaar card photoshoot, a cute baby poses goes viral in Instagram](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/8/CUTEBABY_AADHAR.jpg.webp?itok=JvuJT0Ie)
భారత దేశంలో అపుడే పుట్టిన శిశువు నుంచి వయో వృద్ధుల దాకా పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇది ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రం. అలాగే బ్యాంకింగ్ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా. ఇలా దేనికోసమైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. తాజాగా ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.
సాధారణంగా ఆధార్ కార్డులో ఫోటో చూసుకొని దేవుడా.. అనుకునే వాళ్లు చాలామంది (ఇపుడు ఫోటో మార్చుకునే అవకాశం ఉందనుకోండి) ఉన్నారు. ఇలాంటి ఫోటోలపై చాలా జోక్స్ వినే వింటాం. ఈ సంగతి తనకు తెలుసులే అన్నట్టు ఆధార్ కార్డ్ ఫొటోకు ఓ చిన్నారి (గున్‌గున్) ఇచ్చిన ఫోజులు విశేషంగా నిలిచాయి. అసలే పింక్ గౌన్‌లో చందమామలా ముద్దుగాముద్దుగా ఉంది. దీనికి తోడు ఎవరో చెప్పినట్టు రకాల రకాలుగా క్యూట్ , క్యూట్‌గా ఫోజులిచ్చింది. <
బుగ్గలపై చేయి పట్టుకుని ఒకసారి, అమాయకంగా చూస్తూ ఒకసారి, చిలిపిగా, అందంగా మల్లెపువ్వులా నవ్వుతూ కనిపించింది. అచ్చంగా పార్లే జీ పాపాలాగా కనిపించింది. దీంతో ఈ చిట్టి తల్లి వాళ్ల అమ్మ వీడియో తీసి గున్‌గున్ అండ్ మామ్‌అనే ఇన్‌స్టా ఐడీలో పోస్ట్ చేసింది. అంతే ఇది వైరల్ అయిపోయింది.
‘పార్లే జీ గర్ల్’ అంటూ నెటిజన్లు తెగ పొగిడేశారు. ఆధార్ ఫోటో అందంగా కనిపించేది ఈ బేబీ ఒక్కతే ఒక యూజర్ కమెంట్ చేయగా, ‘నేను నా రెండేళ్ల కుమార్తెను ఆధార్ కార్డ్ ఫోటో కోసం వెళ్లినపుడు నాకూ ఇదే అనుభవం" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇన్‌స్టాలో 18.3 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment