cute baby
-
‘‘నా ఆధార్, నా ఫోటో..’’ క్యూట్ బేబీ ఫోజులు వైరల్ వీడియో
భారత దేశంలో అపుడే పుట్టిన శిశువు నుంచి వయో వృద్ధుల దాకా పౌరులందరికీ ఆధార్ కార్డు తప్పని సరిగా ఉండాలి. ఇది ఐడెంటిటీ ప్రూఫ్, చిరునామా గుర్తింపు పత్రం. అలాగే బ్యాంకింగ్ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా. ఇలా దేనికోసమైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. తాజాగా ఆధార్ కార్డుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.సాధారణంగా ఆధార్ కార్డులో ఫోటో చూసుకొని దేవుడా.. అనుకునే వాళ్లు చాలామంది (ఇపుడు ఫోటో మార్చుకునే అవకాశం ఉందనుకోండి) ఉన్నారు. ఇలాంటి ఫోటోలపై చాలా జోక్స్ వినే వింటాం. ఈ సంగతి తనకు తెలుసులే అన్నట్టు ఆధార్ కార్డ్ ఫొటోకు ఓ చిన్నారి (గున్‌గున్) ఇచ్చిన ఫోజులు విశేషంగా నిలిచాయి. అసలే పింక్ గౌన్‌లో చందమామలా ముద్దుగాముద్దుగా ఉంది. దీనికి తోడు ఎవరో చెప్పినట్టు రకాల రకాలుగా క్యూట్ , క్యూట్‌గా ఫోజులిచ్చింది. < View this post on Instagram A post shared by BabyNaysha (@gungun_and_mom) బుగ్గలపై చేయి పట్టుకుని ఒకసారి, అమాయకంగా చూస్తూ ఒకసారి, చిలిపిగా, అందంగా మల్లెపువ్వులా నవ్వుతూ కనిపించింది. అచ్చంగా పార్లే జీ పాపాలాగా కనిపించింది. దీంతో ఈ చిట్టి తల్లి వాళ్ల అమ్మ వీడియో తీసి గున్‌గున్ అండ్ మామ్అనే ఇన్‌స్టా ఐడీలో పోస్ట్ చేసింది. అంతే ఇది వైరల్ అయిపోయింది.‘పార్లే జీ గర్ల్’ అంటూ నెటిజన్లు తెగ పొగిడేశారు. ఆధార్ ఫోటో అందంగా కనిపించేది ఈ బేబీ ఒక్కతే ఒక యూజర్ కమెంట్ చేయగా, ‘నేను నా రెండేళ్ల కుమార్తెను ఆధార్ కార్డ్ ఫోటో కోసం వెళ్లినపుడు నాకూ ఇదే అనుభవం" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇన్‌స్టాలో 18.3 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోవడం విశేషం. -
సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
చిన్న పిల్లల చేష్టలు భలే ముద్దుగా ఉంటాయ్. అందులోనూ అమ్మాయిలు చేస్తే ఇంకా ముచ్చటగా ఉంటుంది. అమ్మచీర దొంగచాటుగా చుట్టేసు కోవడం, పెద్ద జడకోసం ఆరాట పడటం . అబ్బో..ఈ లిస్ట్ చాలా పెద్దదే. ఇది మాత్రమే కాదు.. అమ్మ చేసే పనులను కాపీ చేస్తూ ఉంటారు. పెద్ద ఆరిందాలాగా చీపురు పట్టకొని ఊడ్వడం, బుజ్జి బుజ్జి చేతులతో వంట చేసేయడం, వడ్డించడం లాంటి పనులు చేసి మురిపిస్తుంటారు. ఇక ఒక టీవీ చూస్తూ డాన్స్‌లు వేయడం,అద్దం ముందు నించొని చేసే చేష్టల గురించైతే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. తాజాగా ఓ చిన్నారి డ్యాన్స్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.Who says group dance is not possible with a single performer? 😀😛😂 #Dance #cutenessoverload pic.twitter.com/mOJIVgB6yR— Ananth Rupanagudi (@Ananth_IRAS) May 5, 2024 ఒక షాపింగ్ మాల్లో ఒక చిన్నారి ఒక రేంజ్లో డ్యాన్స్ చేసింది. ఎక్కడ ఎవరు తీసారు అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, షాపింగ్ మాల్ ట్రయిల్ రూంలో అద్దం ముందు నిల్చొని అద్భుతంగా స్టెప్పులేసింది. దీంతో అద్దాల్లో నలుగురు చిన్నారులు గ్రూపు డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ అమ్మాయి అభియం కూడా నిజంగా అక్కడ నలుగురు అమ్మాయిలున్నారా అనిపించేలా చేసింది. దీంతో నెటిజన్లు వావ్..సూపర్ అంటున్నారు. మరి మీరు కూడా ఒకసారి చూసేయ్యండి ఆ వీడియోను. -
క్యూట్ బేబీ డాన్స్..చివర్లో ట్విస్ట్
పిల్లలకు అనుకరించే స్వభావం సహజంగానే ఉంటుంది. మొదటగా వాళ్లు తమ తల్లిదండ్రులను అనుకరిస్తారు. వారు ఏ పని చేసినా అదే చేయడానికి చిన్న పిల్లలు ప్రయత్నిస్తారు. ఆ వయసులో వారికి గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏవరేది చేసినా.. వాళ్లు అలా చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొసారి చిన్నవాళ్లు చేసే పనులు నవ్వులు పూయించడంతో పాటు ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాయి. అలా ఓ చిన్నారి టీవీలో వస్తున్న పాటకు స్టెప్పులేసి నవ్వులు పూయించడంతో పాటు చివర్లో ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. ఓ చిన్నారి.. ప్రభుదేవా ప్రముఖ పాత్రలో నటించిన ‘లక్ష్మి’ సినిమాలోని పాటను టీవీలో చూసి.. స్టెప్పులేయడం మొదలుపెట్టింది. ఆ పాటలో చిన్నారి ఎలా డాన్స్ చేస్తే...ఈమె అలాగే చేయడానికి ట్రై చేసింది. అయితే సినిమాలోని చిన్నారి పాటలో భాగంగా బస్సులోని హ్యండిల్ పట్టుకొని జంప్ చేసింది. దీంతో చిన్నారి కూడా అలా జంప్ చేయడానికి ట్రై చేసింది. అటు ఇటు చూసి ఏమి కనిపించకపోవడంతో టీవీనే పట్టుకొని జంప్ చేయడానికి ట్రై చేసింది. ఇంకేముంది వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చిన కొత్త టీవీ ముక్కలైపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్నారిని తప్పుపట్టడంలేదు. ఆమె అనుకరణను చూసి ముచ్చటపడుతున్నారు. ‘ఇంత చిన్న బుర్రకి ఎన్ని తెలివితేటలో అని కొనియాడుతున్నారు’, ‘ఇంటలిజెంట్ బేబీ’, ట్విస్ట్ అదిరింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్న పిల్లలు స్వతహా చేసే పనులకు అడ్డుపడకూడదని, అది వారిలో టాలెంట్‌ను బయటపడేలా చేస్తుందని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే మీరు కూడా చిన్న పిల్లలను స్వేచ్ఛగా, నచ్చిన పని చేస్తుంటే అడ్డుపడకండి. అది వాళ్లలోని ప్రతిభను వెలికితీస్తుంది. -
ఒబామా మమ్మల్ని ఆటపట్టించారు!
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ మహిళను, ఆమె భర్తను సరదాగా ఆటపట్టించారు. ఈ విషయాన్ని ఆ మహిళ స్వయంగా మీడియాతో షేర్ చేసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. గత సోమవారం అలస్కాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి జోలెన్ జాకిన్స్కీ తన భర్త, ఆరు నెలల పాపతో వచ్చింది. భర్త ఏదో పనిమీద కాస్త పక్కకు వెళ్లగా.. నెలల బుజ్జాయిని తల్లి జోలెన్ ఆడిస్తోంది. ఇంతలో సాధారణంగా ఉన్న ఓ వ్యక్తిని ఆమె చూసి ఒబామా అనుకుని పొరపడ్డట్లుగా భావించారు. దగ్గరకెళ్లి చూస్తే ఆశ్చర్యం.. ఆ సాధారణ వ్యక్తి మరెవరో కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే. పాపతో పాటే ఒబాబా వద్దకు నేను చేరుకోగానే ఆయన చిరునవ్వుతో పలకరించారు. ఈ అందమైన బుజ్జాయి ఎవరు అని అడిగారు. మా పాప అని చెప్పిన తర్వాత.. చిన్నారి గిసెల్లేను ఒబామా ఎత్తుకుని ముద్దుచేశారు. ఆ సంతోషంలో నేను ఒబాబాతో సెల్ఫీలు తీసుకున్నాను. గిసెల్లే తండ్రి అక్కడికి రాగానే.. 'మీ పాప అందంగా ఉంది. చిన్నారిని నాతోపాటు తీసుకెళ్తాను. మీకు ఏం ఇబ్బందిలేదు కదా' అంటూ జోక్ చేసి ఒబామా ఆ దంపతులను సరదాగా ఆటపట్టించారు. నిజంగానే తమ పాపను అడిగారేమోనని తన భర్త భావించాడని జోలెన్ తెలిపారు. ఒబామా లాంటి గొప్పవ్యక్తిని కలుసుకుని ఆయనతో ఫొటోలు దిగడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందని, కొందరికి మాత్రమే ఈ చాన్స్ దొరుకుతుందని జోలెన్ జాకిన్స్కీ వివరించారు. ఇందుకు సంబంధించిన ఫొటొలోను తన ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.