పిల్లలకు అనుకరించే స్వభావం సహజంగానే ఉంటుంది. మొదటగా వాళ్లు తమ తల్లిదండ్రులను అనుకరిస్తారు. వారు ఏ పని చేసినా అదే చేయడానికి చిన్న పిల్లలు ప్రయత్నిస్తారు. ఆ వయసులో వారికి గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏవరేది చేసినా.. వాళ్లు అలా చేయడానికి ట్రై చేస్తారు. ఒక్కొసారి చిన్నవాళ్లు చేసే పనులు నవ్వులు పూయించడంతో పాటు ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాయి. అలా ఓ చిన్నారి టీవీలో వస్తున్న పాటకు స్టెప్పులేసి నవ్వులు పూయించడంతో పాటు చివర్లో ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో ప్రకారం.. ఓ చిన్నారి.. ప్రభుదేవా ప్రముఖ పాత్రలో నటించిన ‘లక్ష్మి’ సినిమాలోని పాటను టీవీలో చూసి.. స్టెప్పులేయడం మొదలుపెట్టింది. ఆ పాటలో చిన్నారి ఎలా డాన్స్ చేస్తే...ఈమె అలాగే చేయడానికి ట్రై చేసింది. అయితే సినిమాలోని చిన్నారి పాటలో భాగంగా బస్సులోని హ్యండిల్ పట్టుకొని జంప్ చేసింది. దీంతో చిన్నారి కూడా అలా జంప్ చేయడానికి ట్రై చేసింది. అటు ఇటు చూసి ఏమి కనిపించకపోవడంతో టీవీనే పట్టుకొని జంప్ చేయడానికి ట్రై చేసింది. ఇంకేముంది వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చిన కొత్త టీవీ ముక్కలైపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చిన్నారిని తప్పుపట్టడంలేదు. ఆమె అనుకరణను చూసి ముచ్చటపడుతున్నారు. ‘ఇంత చిన్న బుర్రకి ఎన్ని తెలివితేటలో అని కొనియాడుతున్నారు’, ‘ఇంటలిజెంట్ బేబీ’, ట్విస్ట్ అదిరింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చిన్న పిల్లలు స్వతహా చేసే పనులకు అడ్డుపడకూడదని, అది వారిలో టాలెంట్‌ను బయటపడేలా చేస్తుందని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే మీరు కూడా చిన్న పిల్లలను స్వేచ్ఛగా, నచ్చిన పని చేస్తుంటే అడ్డుపడకండి. అది వాళ్లలోని ప్రతిభను వెలికితీస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment