మామా.. జాగ్రత్త సుమా..! | Youth Selfies And Photo Shoots In Train Track | Sakshi
Sakshi News home page

మామా.. జాగ్రత్త సుమా..!

Published Mon, Jul 16 2018 12:34 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

Youth Selfies And Photo Shoots In Train Track - Sakshi

రైలు వస్తుండగా ఫొటోలు దిగుతున్న యువకులు, రైల్వే ట్రాక్‌పై ఫోజులిస్తున్న యువతీ, యువకులు

కృష్ణా : మామా.. ఎన్ని లైక్‌లు, ఎన్ని కామెంట్లు వచ్చాయిరా .. అబ్బబ్బా ఏం ఫొటో అప్‌లోడ్‌ చేశావ్‌రా.. ఈ రోజంతా ఫేస్‌బుక్‌లో మన ఫ్రెండ్స్‌ అంతా నీ ఫొటో గురించే చర్చ. సూపర్‌ మామా.. అని తోటి స్నేహితుడు అంటుంటే ఫోన్‌ వైపు చూసుకుంటూ తన ఫొటోను మరొక్కసారి తిలకిస్తూ మురిసిపోయాడు మరో స్నేహితుడు.. ఇలాంటి ప్రశంస కోసం నేటి యువత వెర్రెక్కిపోతోంది. ఒకవైపు అర్ధరాత్రి హైవేపై జిగేల్‌మనే లైటింగ్‌లో సెల్ఫీలతో కుల్ఫీ అవుతోంది. మరో వైపు రయ్యిమంటూ దూసుకెళ్లే రైలు పక్కన రాజాలా ఫోజులు పెడుతోంది. ప్రమాదాన్ని పక్కన పెట్టుకుని చిరు దరహాసం చేస్తోంది. ఎన్ని లైక్‌లు వచ్చినా, ఎన్ని కామెంట్‌లు ముంచెత్తినా వీటన్నింటికన్నా ప్రాణం ఖరీదైంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని ఎంజాయ్‌ చేయాలి. జీవితంలో మజాను ఆస్వాదించారు. విజయవాడలో ఆదివారం యువత సీతానగరం వద్ద రైల్వే బ్రిడ్జి, కృష్ణానదిలో పడవలపైనా ఇలా ఫొటోలు  దిగుతుండగా సాక్షి క్లిక్‌మనిపించింది.   – ఫొటోలు, నడిపూడి కిషోర్,సాక్షి ఫొటోగ్రాఫర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement