కాలిఫోర్నియా: నూతన వధువరులకు ఫొటోషూట్ అనేది ఎప్పటికి మిగిలిపోయే మధుర జ్ఞాపకం. కానీ అమెరికాకు చెందిన ఓ జంటకు ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ జంట వివాహ అనంతరం లగునా బీచ్‌కు ఫొటో షూట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు బీచ్ తీరంలో ఓ పెద్ద రాయిపై నిలుచుని ఫొటోకు ఫోజ్ ఇస్తుండగా ఒక్కసారిగి ఓ పెద్ద అలా వారిని సముద్రంలోకి లాక్కెళ్లింది. (ఒక్క ఫోన్‌కాల్: ప‌్రకంపనలు సృష్టించింది..)
అది చూసిన స్థానికులు వధూవరులను రక్షించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఫొటో షూట్ కోసం అంత సాహసం చేయడం అనవసరం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఈ లగునా బీచ్ ప్రసిద్ది చెందింది. ఇక్కడ తరచూ వధువరూలు ఫొటో షూట్‌కు వస్తుంటారని సందర్శకులు తెలిపారు. (వేడుకలు ఆరంభం)
Comments
Please login to add a commentAdd a comment