newly couple
-
ఫొటో షూట్.. కొత్త జంటకు చేదు అనుభవం
కాలిఫోర్నియా: నూతన వధువరులకు ఫొటోషూట్ అనేది ఎప్పటికి మిగిలిపోయే మధుర జ్ఞాపకం. కానీ అమెరికాకు చెందిన ఓ జంటకు ఇది చేదు జ్ఞాపకంగా మిగిలింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ జంట వివాహ అనంతరం లగునా బీచ్‌కు ఫొటో షూట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వారు బీచ్ తీరంలో ఓ పెద్ద రాయిపై నిలుచుని ఫొటోకు ఫోజ్ ఇస్తుండగా ఒక్కసారిగి ఓ పెద్ద అలా వారిని సముద్రంలోకి లాక్కెళ్లింది. (ఒక్క ఫోన్‌కాల్: ప్రకంపనలు సృష్టించింది..) అది చూసిన స్థానికులు వధూవరులను రక్షించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఫొటో షూట్ కోసం అంత సాహసం చేయడం అనవసరం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఈ లగునా బీచ్ ప్రసిద్ది చెందింది. ఇక్కడ తరచూ వధువరూలు ఫొటో షూట్‌కు వస్తుంటారని సందర్శకులు తెలిపారు. (వేడుకలు ఆరంభం) -
పెళ్లింట విషాదం
ఆదిలాబాద్‌రూరల్: ఎన్నో ఆశలతో.. మరెన్నో కలలతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన బోతున్న సమయంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకమైన ఈ రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం దేవాపూర్ ఫారెస్టు చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఘటన నవ దంపతుల కుటుంబాల్లో విషాదం నింపింది. కారులో ప్రయానిస్తున్న పెళ్లి కూతురు సోదరి మెట్పల్లి స్వాతి, స్థానికంగా ఉన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. మావల మండలంలోని రాంనగర్లో నివాసం ఉంటున్న మెట్పల్లి ముత్తమ్మ, అశోక్ దంపతుల పెద్ద కు మార్తె ప్రియాంకకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డెడ్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయి కుమార్‌తో గురువారం వడ్డేడ్‌లో పెద్దలు వి వాహం జరిపించారు. శుక్రవారం మావల మం డలంలోని రాంనగర్లో (పెళ్లి కూతురు ఇంటివద్ద) రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందులో పాల్గొనేందుకు నవదంపతులు బంధువులతో కలిసి వడ్డేడ్ నుంచి ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో దేవాపూర్ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారి 44పై ఉదయం 10.24 గంటల ప్రాంతంలో బరంపూర్ వైపు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్న్ అవుతున్న క్రమంలో కారు అదుపుతప్పి బస్సును సైడ్‌నుంచి ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ప్రియాంక, ఆమె సోదరీ మణులు స్వాతి, ప్రణవి, కజిన్ బ్రదర్ సాయికు మార్, బంధువు రాజేశ్‌తో పాటు పెళ్లి కుమారుని మేనత్త దొనకంటి రాజమణి ఉండగా పెండ్లి కుమారుడు సాయికుమార్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఫారెస్టు అధికారులు, సిబ్బంది, స్థానికులు కారు అద్దాలను ధ్వం సం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో అడెపల్లి సాయికుమార్‌తో పాటు ఆయన మేనత్త రాజమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మావల ఎస్సై తెలిపారు. నిలిచి పోయిన ఫంక్షన్.. వివాహం జరిగిన మరుసటి రోజు పెళ్లి కూతురు ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో గంటలోపు భోజనాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇంతలో రోడ్డు ప్రమా దం చోటు చేసుకోవడంతో రిసెప్షన్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని రోదిం చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడ్డ వారికి నాణ్య మైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, తదితరులు ఉన్నారు. -
పెళ్లింట విషాదం
ఆదిలాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో నవదంపతులు సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దేవాపూర్ ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద శుక్రవారం జరిగింది. మరో పది నిమిషాల్లో ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనే సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో నవదంపతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మావల మండలం రాంనగర్లో నివాసం ఉంటున్న మెట్పల్లి ముత్తమ్మ–అశోక్ దంపతుల పెద్ద కుమార్తె ప్రియాంకకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డెడ్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయికుమార్‌తో గురువారం పెళ్లి కుమారుని ఇంటి వద్ద వివాహమైంది. శుక్రవారం పెళ్లి కూతురు ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇందుకు కారులో నవదంపతులతోపాటు పెళ్లి కూతురు బంధువులు వడ్డెడ్ నుంచి ఆదిలాబాద్‌కు కారులో బయల్దేరారు. దేవాపూర్ ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారి 44పై ఆదిలాబాద్ నుంచి బరంపూర్ గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్న్ అవుతుండగా వీరి కారు ఢీకొట్టింది. కారు నడుపుతున్న పెళ్లికొడుకు సాయికుమార్ బ్రేక్ వేసినా అదుపు కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా పెళ్లి కొడుకు సాయికుమార్, ఆయన మేనత్త దొనకంటి రాజమణిలకు తీవ్రగాయాలయ్యాయి. మరో నలుగురు కూడా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిలిచిపోయిన ఫంక్షన్ పెళ్లి కూతురు ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లలో నిమగ్న మయ్యారు. అప్పటికే వంటలు సైతం పూర్తి కావచ్చాయి. మరో గంటలోపు భోజనాలు సైతం ప్రారంభం కానున్న వేళ రోడ్డు ప్రమాదంలో నవదంపతులు, వారి బంధువులు గాయపడటంతో రిసెప్షన్ నిలిచిపోయింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఆçస్పత్రికి చేరుకున్నారు. అక్కడ బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. -
చూడచక్కని జంట.. ఆకుపచ్చని పెళ్లి
సాక్షి, ముంబై: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను ప్రస్తుత తరంవారు విభిన్నంగా, అందరూ మెచ్చుకునేలా, అందరినీ ఆలోచింపజేసేలా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేశారు ముంబైకి చెందిన దీపా కామత్, ప్రషిన్ జాగర్ జంట. వివాహం అనగానే పెళ్లి పత్రికల నుంచి మొదలు డెకరేషన్స్, భోజనాలు చేసే ప్లేట్లు, గ్లాస్‌ల దాకా పర్యావరణానికి విఘాతం కలిగించేవే. ప్రకృతికి నష్టం కలిగించే ఇలాంటి వస్తువులేవీ వాడకుండా.. పర్యావరణ హితంగా తమ పెళ్లి ఉండాలని వారు కోరుకున్నారు. తమ సాదాసీదాగా వినూత్న వివాహానికి పెద్దలను, స్నేహితులను ఒప్పించారు. వారి సహకారంతో పర్యావరణానికి అనుకూలమైన, రీసైక్లింగ్ (జీరో ప్లాస్టిక్)వస్తువులనే వాడాలని, ఆఖరికి టిష్యూ పేపర్ కూడా వాడకూదని(పేపర్ చెట్ల నుంచి వస్తుందని) నిర్ణయించుకున్నారు. వివాహ ఆహ్వానానికి పత్రికల బదులు వాట్సప్ మెసేజ్, దగ్గరి బంధువులను కలిసి ఆహ్వానం చెప్పివచ్చారు. భోజనాలు వడ్డించేందుకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పాత పద్ధతి పళ్లాలు వాడారు. వీరనుకున్నంత సులభంగా ఈ పనులు జరగలేదు. ఎన్నో అడ్డంకులు, బంధువుల నుంచి వ్యతిరేకత వీటన్నింటినీ అధిగమించి, ప్రకృతి ఒడిలో అందరినీ ఆలోచింపజేసాలా వీరి వివాహ వేడుక జరిగింది. వీరి పర్యావరణ అనుకూల వివాహం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు హృదయాలను గెలుచుకుంటోంది. -
నూతన వధూవరులు
గత రెండు రోజుల్లో ఒక్కటైన నూతన వధూవరులతోపాటు దుర్గమ్మ సన్నిధిలో పెళ్లి చేసుకునేందుకు వచ్చినవారితో ఆదివారం ఇంద్రకీలాద్రిపై సందడి వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణంలోని షెడ్డుతో పాటు ఉపాలయాల వద్ద పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. నూతన వధూవరులతో పాటు సాధారణ భక్తులు కూడా భారీగా రావడం తో ఆదివారం తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు 50వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వ దర్శనం క్యూలైనైఉలో అమ్మవారి దర్శనా నికి మూడు గంటల సమయం పట్టింది. శీ్రౌు్ఛ దర్శనం క్యూలైనైఉ షాపింగ్ కాంెౌ్ఛ్లక్స్ దాటింది. మహానివేదన, సాయంత్రం పంచహారతుల సమయంలో రద్దీ మరింతగా నెలకొంది. భక్తుల వాహనాలు నిలపడంతో ౌూ్ఛటైఉరోడ్డుపై రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఉదయం 11 గంటల నుంచే కొండపైకి ద్విచక్రవా హనాలు మినహా ఇతర వాహనాలను అను మతించలేదు. కార్లు, వ్యాన్లు, ఇతర వాహనాలను కనక దుర్గనగర్‌లో నిలుపుకోవాలని దేవస్థాన సిబ్బంది సూచిస్తుండగా, అక్కడా ఖాళీ లేకపోవ డంతో భక్తులు తమ వాహనాలను అర్జున వీధిలో నిలుపోవాల్సి వచ్చింది.