చికిత్స పొందుతున్న ప్రియాంక
ఆదిలాబాద్‌రూరల్: ఎన్నో ఆశలతో.. మరెన్నో కలలతో వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. మరికొద్ది నిమిషాల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన బోతున్న సమయంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. హృదయ విదారకమైన ఈ రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్ జిల్లాలోని మావల మండలం దేవాపూర్ ఫారెస్టు చెక్ పోస్టు వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఘటన నవ దంపతుల కుటుంబాల్లో విషాదం నింపింది.
కారులో ప్రయానిస్తున్న పెళ్లి కూతురు సోదరి మెట్‌పల్లి స్వాతి, స్థానికంగా ఉన్న అటవీశాఖ అధికారులు, పోలీసుల కథనం ప్రకారం.. మావల మండలంలోని రాంనగర్‌లో నివాసం ఉంటున్న మెట్‌పల్లి ముత్తమ్మ, అశోక్ దంపతుల పెద్ద కు మార్తె ప్రియాంకకు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్డెడ్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయి కుమార్‌తో గురువారం వడ్డేడ్‌లో పెద్దలు వి వాహం జరిపించారు. శుక్రవారం మావల మం డలంలోని రాంనగర్‌లో (పెళ్లి కూతురు ఇంటివద్ద) రిసెప్షన్ ఏర్పాటు చేశారు. విందులో పాల్గొనేందుకు నవదంపతులు బంధువులతో కలిసి వడ్డేడ్ నుంచి ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌కు కారులో బయలుదేరారు.
మార్గమధ్యలో దేవాపూర్ చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారి 44పై ఉదయం 10.24 గంటల ప్రాంతంలో బరంపూర్ వైపు నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు టర్న్ అవుతున్న క్రమంలో కారు అదుపుతప్పి బస్సును సైడ్‌నుంచి ఢీకొట్టింది. ఘటన సమయంలో కారులో ప్రియాంక, ఆమె సోదరీ మణులు స్వాతి, ప్రణవి, కజిన్ బ్రదర్ సాయికు మార్, బంధువు రాజేశ్‌తో పాటు పెళ్లి కుమారుని మేనత్త దొనకంటి రాజమణి ఉండగా పెండ్లి కుమారుడు సాయికుమార్ కారును డ్రైవ్ చేస్తున్నాడు. ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఫారెస్టు అధికారులు, సిబ్బంది, స్థానికులు కారు అద్దాలను ధ్వం సం చేసి క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో అడెపల్లి సాయికుమార్‌తో పాటు ఆయన మేనత్త రాజమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా రు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మావల ఎస్సై తెలిపారు.
నిలిచి పోయిన ఫంక్షన్..
వివాహం జరిగిన మరుసటి రోజు పెళ్లి కూతురు ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మరో గంటలోపు భోజనాలు సైతం ప్రారంభం కానున్నాయి. ఇంతలో రోడ్డు ప్రమా దం చోటు చేసుకోవడంతో రిసెప్షన్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని రోదిం చిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శ
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. గాయపడ్డ వారికి నాణ్య మైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆయన వెంట జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment