ఒక్క ఫోటో ఆమె జీవితాన్ని మార్చేసింది | Sudanese model Anok Yai Story | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 23 2017 12:39 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

Sudanese model Anok Yai Story - Sakshi

సాక్షి : అతి కష్టం మీద వెలుగులోకి వచ్చే కొన్ని నిజాలు భరించటానికి కూడా కష్టంగానే ఉంటాయి. సుడాన్‌కు చెందిన ఓ మోడల్‌ జీవితం ఒక్క ఫోటోతో ఎలా మారిపోయిందంటే.. రాత్రికి రాత్రే ఆమెను ఈ భూమ్మీద అత్యంత అందగత్తెగా మార్చి పడేసింది. 

అనోక్‌ యాయి.. వాషింగ్టన్‌లో హోవార్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్‌ని ఆమె సౌందర్య బాగా ఆకర్షించింది. దీంతో అతను ఓ ఫోటో తీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ క్రమంలో ఓ చిత్రం ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడంత మంది అభిమానులను సంపాదించిపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించటమే కాదు.. తక్కువ కాలంలోనే ఆమెను సూడాన్‌ లేడీ సూపర్‌గా చేసేసింది.

The leaves match my skin 🍂

A post shared by Anok (@anokyai) on

ఈ క్రమంలో ఎక్కడా ఆమెపై జాతి వివక్ష కామెంట్లు రాకపోవటం విశేషం. ప్రస్తుతం ఆమె సంపాదన గంటకు 15,000 వేల డాలర్లపైగానే ఉందంట. అంతర్జాతీయ మాగ్జైన్‌లు సైతం టాప్‌ సెక్సీ మోడళ్లను పక్కన పడేసి ఇప్పుడు  ఆమె ముఖచిత్రం కోసం ఎగబడిపోతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement