అభిమానుల చెత్త ప్రశ్నలు.. నటి సమాధానాలు | Bruna Abdullah Was Asked A Naughty Question By Fan | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 6 2018 6:46 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Bruna Abdullah Was Asked A Naughty Question By Fan - Sakshi

సోషల్‌ మీడియా హవా పెరగడంతో నటీనటులు తమ అభిమానులతో నేరుగానే సంభాషించే అవకాశం వచ్చింది. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ.. వారి సమయస్పూర్తిని చాటుకుంటున్నారు. ఒకప్పటి మోడల్‌, బాలీవుడ్‌ నటి బ్రూనా అబ్దుల్లా కూడా.. తన అభిమానులతో కాసేపు ముచ్చటించడానికి ఆన్‌లైన్లోకి వచ్చారు. 

ఇక అభిమానులు ఊరికే ఉంటారా?. తమకు నచ్చిన ప్రశ్నలను సంధిస్తుంటారు. అందులో కొందరు అసభ్యకరమైన ప్రశ్నలను కూడా అడుగుతుంటారు. అయితే వాటికి సమాధానాలు చెప్పడం చెప్పకపోవడం వారిష్టం. అయితే బ్రూనాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి బ్రూనా ఇచ్చిన సమాధానమే తన సమయస్పూర్తిని చాటుతోంది. 

మీరెప్పుడైనా ముగ్గురితో గడిపారా? అని ఓ అభిమాని బ్రూనాను అడగ్గా.. ‘ఓ ముగ్గురు కలిసి ఒకే పని చేయడం గురించే కదా మీరు అడిగింది? అవును నేను పాల్గొన్నాను. నా స్నేహితులతో లంచ్‌ చేస్తుంటాను’ అని సమాధానం ఇచ్చింది. మరొక తుంటరి.. మీరు వర్జినా? అంటూ.. అడగ్గా, కాదు ‘నేను స్కార్పియో (వృశ్చికం)’ అంటూ తెలివిగా సమాధానమిచ్చింది. ఇంకొక ఆకతాయి.. బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందా? అని అడిగితే.. ‘స్పష్టంగా తెలుస్తోంది కదా’ అంటూ సమాధానం ఇచ్చింది. కానీ ఉందో లేదో అని మాత్రం డైరెక్ట్‌గా చెప్పలేదు. ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు ఇచ్చి తప్పించుకున్న ఈ భామ గ్రాండ్‌ మస్తీ, జయహో, బిల్లా 2 సినిమాలతో ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement