Bruna Abdullah
-
ఈ అమ్మాయే నా భర్తను దొంగలించింది: నటి
ముంబై: బ్రెజిలియన్ బాలీవుడ్ నటి, మోడల్ బ్రూనా అబ్దుల్లా గురువారం ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ పోస్టును పంచుకున్నారు. ఇందులో తన భర్త అలన్ ఫ్రేజ్‌ను దొంగలించిన అమ్మాయి ఫొటోలను, వీడియోను పంచుకున్నారు. అయితే ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే. ఆ అమ్మాయి ఎవరో కాదు బ్రూనా-ఫ్రేజ్ల ఏడాది కూతురు ఇసాబెల్లా. తన భర్త, కూతురు ఫొటోలను షేర్ చేస్తూ.. ‘ఈ అమ్మాయే నా భర్తను దొంగలిచింది’ అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో పోస్టు చేసి అందరికి స్వీట్ షాక్ ఇచ్చారు. ఇందులో ఫ్రేజ్, ఇసాబెల్లాలు సరదాగా ఆడుకుంటున్న వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లంతా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘ఇసాబెల్లా చాలా క్యూట్‌గా ఉంది’, ‘హా హ్హా హ్హా.. బాగుంది’, ‘మీకు మరో అవకాశం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. తన చిరకాల మిత్రుడైన అలన్ ఫ్రేజ్‌ను బ్రూనా గత ఏడాది మే నెలలో సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరికి ఏడాది కూతురు ఇసాబెల్లా ఉంది. ఇటీవల ఇసాబెల్లా మొదటి పుట్టిన రోజు జరుపుకున్న ఫోటోలు కూడా ఆమె షేర్ చేశారు. View this post on Instagram Me vs the Girl who stole my husband 😝 @alfromscotland A post shared by Bruna Abdullah (@brunaabdullah) on Sep 16, 2020 at 11:23pm PDT -
అభిమానుల చెత్త ప్రశ్నలు.. నటి సమాధానాలు
సోషల్ మీడియా హవా పెరగడంతో నటీనటులు తమ అభిమానులతో నేరుగానే సంభాషించే అవకాశం వచ్చింది. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ.. వారి సమయస్పూర్తిని చాటుకుంటున్నారు. ఒకప్పటి మోడల్, బాలీవుడ్ నటి బ్రూనా అబ్దుల్లా కూడా.. తన అభిమానులతో కాసేపు ముచ్చటించడానికి ఆన్‌లైన్‌లోకి వచ్చారు. ఇక అభిమానులు ఊరికే ఉంటారా?. తమకు నచ్చిన ప్రశ్నలను సంధిస్తుంటారు. అందులో కొందరు అసభ్యకరమైన ప్రశ్నలను కూడా అడుగుతుంటారు. అయితే వాటికి సమాధానాలు చెప్పడం చెప్పకపోవడం వారిష్టం. అయితే బ్రూనాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి బ్రూనా ఇచ్చిన సమాధానమే తన సమయస్పూర్తిని చాటుతోంది. మీరెప్పుడైనా ముగ్గురితో గడిపారా? అని ఓ అభిమాని బ్రూనాను అడగ్గా.. ‘ఓ ముగ్గురు కలిసి ఒకే పని చేయడం గురించే కదా మీరు అడిగింది? అవును నేను పాల్గొన్నాను. నా స్నేహితులతో లంచ్ చేస్తుంటాను’ అని సమాధానం ఇచ్చింది. మరొక తుంటరి.. మీరు వర్జినా? అంటూ.. అడగ్గా, కాదు ‘నేను స్కార్పియో (వృశ్చికం)’ అంటూ తెలివిగా సమాధానమిచ్చింది. ఇంకొక ఆకతాయి.. బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఉందా? అని అడిగితే.. ‘స్పష్టంగా తెలుస్తోంది కదా’ అంటూ సమాధానం ఇచ్చింది. కానీ ఉందో లేదో అని మాత్రం డైరెక్ట్‌గా చెప్పలేదు. ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు ఇచ్చి తప్పించుకున్న ఈ భామ గ్రాండ్ మస్తీ, జయహో, బిల్లా 2 సినిమాలతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.