కిస్బూ ది బెలూన్ గర్ల్ (వైరల్ అయిన ఫొటోలు)
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే!. కానీ, సమయానికి అది బయటపడితేనే.. గుర్తింపు దక్కేది. అందుకు ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం కూడా. ఇవాళ రేపు ఓవర్‌నైట్ సెన్సేషన్స్‌కి ఒక వేదిక అయ్యింది ఇంటర్నెట్. బచ్‌పన్ కా ప్యార్, కచ్చా బాదామ్ లాంటి వాళ్లు ఇలా పాపులర్ అయినవాళ్లే. ఈ లిస్ట్‌లో ఇప్పుడు చేరిపోయింది బెలూన్లు అమ్ముకునే యువతి కిస్బూ.
కిస్బూ రాజస్థానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. కేరళలో ఆమె కుటుంబం సెటిల్ అయ్యింది. రోడ్ల మీద, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తోంది ఈమె కుటుంబం. అయితే అండలూర్ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లిన కిస్బూ జీవితం.. రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది.
వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన అర్జున్ కృష్ణన్.. సరదాగా జాతరకు వెళ్లి ఫొటోలు తీయసాగాడు. అక్కడ అర్జున్.. అనుకోకుండా అక్కడే బుగ్గలు అమ్ముకుంటున్న కిస్బూను క్లిక్‌మనిపించాడు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చింది. దీంతో ముగ్దుడైన అర్జున్..ఆ ఫొటోను కిస్బూ, ఆమె తల్లికి చూపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో వైరల్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. దీంతో స్టైలిష్ రమ్య ఆధ్వర్యంలో ఆమెతో కొన్ని ఫొటోషూట్లు చేయించారు. దీంతో ఇప్పుడామె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయింది.
సిగ్నళ్ల దగ్గర బుడగలు అమ్ముకునే కిస్బూ.. మోడలింగ్ ఫొటోషూట్లు వైరల్ కావడం, ఆమెకు పలు బ్రాండ్స్ అవకాశాలు దక్కడంపై ఫొటోగ్రాఫర్ అర్జున్ స్పందించాడు. తాను తీసిన ఒక్క ఫొటో వల్ల ఆమె జీవితం మారిపోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇంత గుర్తింపునకు కారణమైన అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు కిస్బూ, ఆమె తల్లి.
Comments
Please login to add a commentAdd a comment