
మ్యాచో హీరో గోపీచంద్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండరన్న సంగతి తెలిసిందే. సినిమాలు తప్ప ఆయన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాల్లో చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా గోపీచంద్ తన చిన్న కొడుకు వియాన్‌తో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సులో కనిపించారు.
ఫోటోలకు ఫోజులిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న వియన్ క్యూట్ లుక్స్ నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ ప్రస్తుతం శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో లౌక్యం, లక్ష్యం చిత్రాలు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment