విలన్ పాత్రలతో ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు గోపీచంద్. పరాజయాలు ఎదరురైనా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో చెరగని ముద్ర వేశారు. ఆయన నుంచి సినిమా విడుదల అవుతుంది అంటూ మినిమమ్ గ్యారెంటీగా ఉంటుందని ఇండిస్ట్రీలో టాక్ ఉంది. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో 'భీమా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గోపీ చంద్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా గోపీ ముందుంటారు. కానీ ఆయన చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పుకోరు. అందుకు కారణాన్ని ఆయన ఇలా చెప్పారు. 'ఇష్టంతో చేసే పనిని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముంది..? నాకు ఉన్న శక్తి మేరకు కొంతమందిని చదివించాను.. వారిలో కొందరు ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. నా నుంచి సాయం పొందిన వారిలో కొంతమందికి నా పేరు కూడా తెలియదు.
(ఇదీ చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్ అంబానీ బరువుపై హీరోయిన్ కామెంట్లు)
బాగా చదువుకోవాలనే తపన ఉండి.. అలాంటి వారికి డబ్బే అడ్డు అయితే.. తప్పకుండా సాయం చేస్తాను. ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడటానికి చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే నేను చదువుకునే పిల్లలకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా చిన్నతనంలో ఒంగోలులో మాకు స్కూల్ ఉండేది. దానిని నాన్నగారే చూసుకునే వారు ఆయన మరణం తర్వాత మేము దాన్ని కొనసాగించలేకపోయాం. ఆ బాధ ఇప్పటికీ ఉంది. ఒక మంచి స్కూల్ పెట్టి విద్యను అందించాలని నాన్న అనుకునే వారు.' అని ఆయన అన్నారు.
ఇక సినిమా విషయానికొస్తే భీమాలో అందరూ అఘోరాలు ఉన్నారని 'అఖండ'తో పోల్చుతున్నారు. కానీ ఈ చిత్రం అలా ఉండదని ఆయన గోపీ చంద్ చెప్పారు. పరశురామ క్షేత్రాన్ని బ్యాక్‌డ్రాప్‌లో తీసుకుని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఇది కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్‌గా ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతారని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment