Bhimaa Movie
-
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
Bhimaa Thanks Meet: భీమా మూవీ థ్యాంక్స్ మీట్ (ఫోటోలు)
-
భీమాని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్
‘‘భీమా’ సినిమా బాగుంది. యాక్షన్, కామెడీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్‌లో మంచి వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వస్తోంది. ఇంత మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్లో దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘భీమా’ వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన దర్శకుడు హర్షకు, నిర్మాత రాధామోహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘భీమా’కు ఆడియన్స్ నుంచి లభిస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు హర్ష. ‘‘రోజు రోజుకీ మా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. విద్యార్థుల పరీక్షలు పూర్త య్యాయి. చూడనివారు మా సినిమాను చూడండి’’ అన్నారు రాధామోహన్. మాళవికా శర్మ మాట్లాడారు. -
‘భీమా’ మూవీ రివ్యూ.. 'గోపీచంద్' హిట్ కొట్టాడా..?
టైటిల్: భీమా నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్,మాళవిక శర్మ,నాజర్,వెన్నెల కిషోర్,నరేష్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మాత: కేకే రాధామోహన్ దర్శకత్వం: ఏ. హర్ష సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ సంగీతం: రవి బస్రుర్ విడుదల తేది: మార్చి 8, 2024 భీమా కథేంటంటే సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభం అవుతుంది. ఒకానొక సమయంలో పరశురాముడు కొత్త భూభాగం కావాలని వరుణుడిని కోరాడు. సముద్రంలో గొడ్డలిని విసిరితే విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలి విసిరాడు. దీంతో సముద్రం వెనక్కు వెళ్లింది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంది. కేరళలోని మహేంద్రగిరిలో సినిమా కథ మొదలౌతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకల్లోలంగా ఉంటుంది. అక్కడి ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తి భవాని (ముఖేష్ తివారి) గడగడలాడించే స్థాయిలో ఉంటాడు. పెట్రోల్ ట్యాంకర్స్ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తి భవాని తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మరో వైపు భీమా కథలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరులో గత యాభైఏళ్లుగా మూత పడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవాని. సరిగ్గా అలాంటి సమయంలో ఎస్సైగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు భీమా (గోపీచంద్)... ఈ క్రమంలోనే విద్య (మాళవికా శర్మ) ఎంట్రీ ఇస్తుంది. విద్య ఒక స్కూల్లో పనిచేస్తూనే మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా రవీంద్రవర్మ (నాజర్) ఉంటారు. ఆయన దగ్గర విద్య మొక్కలపై పలు పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ రవీంద్రవర్మ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే.. శక్తి భవాని ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలో మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తుంటాడు రవీంద్రవర్మ.. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ కథలో పెట్రోలు ట్యాంకర్స్ మాటున భవాని చేస్తున్న అక్రమ వ్యాపారం ఏంటి..? భీమాని అడ్డుకోవటం కోసం భవాని పన్నిన వ్యూహం ఏమిటి..? విలన్లను ఎదుర్కొనే క్రమంలో భీమా ఏం అయ్యాడు..? ఎప్పుడో చిన్నతనంలో విడిపోయిన తన తమ్ముడు రామా (గోపీచంద్) కథలోకి ఎలా వచ్చాడు..? పరశురామ క్షేత్రంలో ఉన్న శివాలయం 50 ఏళ్లుగా ఎందుకు మూత పడింది..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సినిమా చూస్తున్నంత సేపు అందరిలో కలుగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే అసలు ట్విస్ట్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే 'భీమా' చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా ప్రారంభంలోనే పరశురాముడి గురించి చెప్పడం.. ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని అనుకుంటాం కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లోనే తెలిపోతుంది. అక్కడ నుంచి రోటీన్ కమర్షియల్ స్టోరీతో సినిమా జరుగుతుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా సినిమాల్లో కనిపించిందే ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన కన్నడ డైరెక్టర్ ఏ. హర్ష కొంత సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయాడు. సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్‌ను చివరి వరకు ఎక్కడా ప్రస్థావన ఉండదు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి.. ఎందుకంటే గోపీచంద్ రెండు పాత్రలు చేశాడు.. ఆపై గుడి కాన్సెప్ట్ ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమాలో అది కాస్తా మైనస్‌గా మారింది. కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీకి ఫాంటసీ ఎలిమెంట్‌ను చేర్చి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్, మాళవికా శర్మ మధ్య ఉండే లవ్ ట్రాక్ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. కన్నడ చిత్ర సీమలో కొరియోగ్రాఫర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన ఏ. హర్ష శివరాజ్‌కుమార్‌తో 'వేదా' చిత్రాన్ని తీసి తెలుగు వారికి దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్‌తో భీమా సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు.. రెండు పాత్రలలో ఆయన ఇరగదీశాడు.. సినిమా మొత్తం సింగిల్ హ్యాండ్‌తో నడిపించాడు. సినిమా స్టోరీ అంతా కూడా ఫాంటసీ ఎలిమెంట్‌తో డైరెక్టర్ తెరకెక్కించి ఉండుంటే భారీ హిట్ కొట్టేది అని చెప్పవచ్చు. ఎవరెలా చేశారంటే.. భీమాగా పోలీసు గెటప్‌లో కనిపించిన గోపీచంద్.. రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. రెండు క్యారెక్టర్లలో ఇరగదీశాడని చెప్పవచ్చు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ ఆయన చక్కగా నటించాడు. ఇక సినిమాలో గోపీచంద్ తర్వాత నాజర్ పాత్ర అందరినీ మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్ మాళవికా శర్మ,ప్రియా భవానీ శంకర్ల కెమిస్ట్రీ ఫర్వాలేదనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్ ఉన్నంత సేపు ప్రేక్షకులో ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ అందరినీ కట్టిపడేస్తుంది. విలన్‌గా నటించిన శక్తి భవానీని డైరెక్టర్ అంతగా ఉపయోగించుకోలేదు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్,నరేష్, పూర్ణ,నాజర్ వంటి స్టార్స్ వారి పరిధిమేరకు మెప్పించారు. సాంకేతిక విషయాలకొస్తే.. రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. ఆయన అందించిన బీజీఎమ్ సినిమాపై పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. పాటలు అంతగా నోటెడ్ కాకపోయినప్పటికీ తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు అనిపిస్తాయి. సినిమా చివరిలో 30 నిమిషాల పాటు దర్శకుడి చూపిన పని తీరుకు ఎక్కువ మార్కులు పడుతాయి. -బ్రహ్మ కోడూరు, సాక్షి వెబ్ డెస్క్ -
గోపీచంద్ 'భీమా' టాక్ ఎలా ఉందంటే..
గోపీచంద్ హీరోగా నటించిన భీమా నేడు (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. కన్నడ దర్శకుడు ఏ హర్ష ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందొ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. భీమా భారీ యాక్షన్ మూవీ అని ఓవర్సీస్ ఆడియెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. గోలీమార్ తర్వాత మరోసారి పోలీస్ అవతారంలో గోపీచంద్ మెప్పించాడని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాపులతో ఉన్న గోపీచంద్‌కు ఈ సినిమా కాస్త రిలీఫ్ ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా గోపీచంద్ కటౌట్‌గా తగ్ కథ భీమాతో కుదిరిందని నెటిజన్లు అంటున్నారు. డ్యూయల్ షేడ్ క్యారెక్టర్లోగోపీచంద్ తన అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని పేర్కొంటున్నారు. పరుశురామ క్షేత్రం ఎపిసోడ్లో గోపీచంద్ శివతాండవం చేశాడని నెట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా గోపీచంద్‌కు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంత మేరకు తోడు కావడంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. భీమా సినిమాకు ప్రధానంగా యాక్షన్ సీక్వెన్స్‌లు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ రేంజ్లో ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన బీజీఎమ్ పీక్స్‌కు వెళ్తుందని ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. చాలా సీన్స్‌కు ఆయన ఇచ్చిన ఎలివేషన్ బీజీఎమ్‌తోనే సినిమాకు మేజర్ ప్లస్ అయిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరీర్లో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన మూవీగా భీమా రికార్డుకెక్కింది. భీమాతో గోపీచంద్ మళ్లీ హిట్టు ట్రాక్‌లోకి వచ్చాడని ఓ నెటిజన్ కామెంట్ చేయగా ఫ్యాన్స్‌కు మాత్రం భీమాతో బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చాడని తెలుపుతున్నారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని గ్యారెంటీగా భీమా మెప్పిస్తుందని కామెంట్ల చేస్తున్నారు. @YoursGopichand Nee Cutout Ki Padalsina Cinema Ani Strong Feeling 🔥 Expecting Macho Star Mass Blockbuster#BHIMAA #BhimaaFromToday pic.twitter.com/tqV9dTnFLS — ST (@Iconic_Powerism) March 7, 2024 INSIDE INFO : #BHIMAA - INTERVAL IS GOOD & CLIMAX IS MAJOR HIGHLIGHT OF THE FILM 🔥🔥🔥🔥🔥#Gopichandh pic.twitter.com/CFKRcFYn6X — GetsCinema (@GetsCinema) March 7, 2024 interval ❌ climax🥵🥵🥵#BhimaaFromToday #BHIMAA pic.twitter.com/0Bo9uiZVoA — Santhosh (@Santhosh_offl8) March 8, 2024 The Backbone Of The Film @RaviBasrur .... You're One Of The Reason To Witness #BHIMAA .... Definitely Your Music Gonna Resound More 🔥❤️🔥💥🔥❤️🔥💥 declaring MASSive Blockbuster in advance #BHIMAA#Gopichand #BHIMAA @BhimaaMovie pic.twitter.com/TjajnXcVR1 — Surya Sujith (@ntrfansujith) March 7, 2024 Telugu audience always failed to encourage our gem of actors like #gopichand films like sahasam, okkadunnadu & Gautham nanda deserved so much love. Unfortunately Telugu audience were busy praising other language films. #bhimaa #Gaami pic.twitter.com/EIVkV0TtBH — Theinfiniteview (@theinfiniteview) March 8, 2024 -
వాళ్లకు చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పుకోలేదు.. కారణం ఇదే: గోపీచంద్
విలన్ పాత్రలతో ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా రాణిస్తున్నారు గోపీచంద్. పరాజయాలు ఎదరురైనా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ తన నటనతో చెరగని ముద్ర వేశారు. ఆయన నుంచి సినిమా విడుదల అవుతుంది అంటూ మినిమమ్ గ్యారెంటీగా ఉంటుందని ఇండిస్ట్రీలో టాక్ ఉంది. తాజాగా ఆయన ఎ. హర్ష దర్శకత్వంలో 'భీమా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గోపీ చంద్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు సామాజిక సేవలో కూడా గోపీ ముందుంటారు. కానీ ఆయన చేస్తున్న సాయం గురించి ఎక్కడా చెప్పుకోరు. అందుకు కారణాన్ని ఆయన ఇలా చెప్పారు. 'ఇష్టంతో చేసే పనిని బయటకు చెప్పాల్సిన అవసరం ఏముంది..? నాకు ఉన్న శక్తి మేరకు కొంతమందిని చదివించాను.. వారిలో కొందరు ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. నా నుంచి సాయం పొందిన వారిలో కొంతమందికి నా పేరు కూడా తెలియదు. (ఇదీ చదవండి: వేడుకలకు పిలుపు లేదనే అక్కసుతో అనంత్ అంబానీ బరువుపై హీరోయిన్ కామెంట్లు) బాగా చదువుకోవాలనే తపన ఉండి.. అలాంటి వారికి డబ్బే అడ్డు అయితే.. తప్పకుండా సాయం చేస్తాను. ఒక వ్యక్తి తన కాళ్లపై తాను నిలబడటానికి చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే నేను చదువుకునే పిల్లలకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. నా చిన్నతనంలో ఒంగోలులో మాకు స్కూల్ ఉండేది. దానిని నాన్నగారే చూసుకునే వారు ఆయన మరణం తర్వాత మేము దాన్ని కొనసాగించలేకపోయాం. ఆ బాధ ఇప్పటికీ ఉంది. ఒక మంచి స్కూల్ పెట్టి విద్యను అందించాలని నాన్న అనుకునే వారు.' అని ఆయన అన్నారు. ఇక సినిమా విషయానికొస్తే భీమాలో అందరూ అఘోరాలు ఉన్నారని 'అఖండ'తో పోల్చుతున్నారు. కానీ ఈ చిత్రం అలా ఉండదని ఆయన గోపీ చంద్ చెప్పారు. పరశురామ క్షేత్రాన్ని బ్యాక్‌డ్రాప్‌లో తీసుకుని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. ఇది కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్‌గా ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అవుతారని అభిప్రాయపడ్డారు. -
Bhimaa: ఎమోషన్.. ఎలివేషన్.. ఎంటర్టైన్మెంట్తో పాటు సందేశం
‘‘సినిమాలో ఏ మాత్రం ల్యాగ్ ఉన్నా సరే థియేటర్స్‌లో ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు. సో... ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయాలంటే మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. ‘భీమా’లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది. ఎలివేషన్.. ఎమోషన్.. ఎంటర్టైన్మెంట్లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో ‘భీమా’ చిత్రంలో ఓ సామాజిక సందేశం కూడా ఉంది’’ అన్నారు దర్శకుడు ఎ. హర్ష. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో ఎ.హర్ష మాట్లాడుతూ– ‘‘కరోనా సెకండ్ వేవ్ సమయంలో ‘భీమా’ చిత్రం సహనిర్మాత శ్రీధర్‌గారు ఓ కథ ఉంటే చెప్పమన్నారు. ఆన్లైన్లో గోపీచంద్‌గారికి ‘భీమా’ స్టోరీలైన్ చెప్పాను. ఆ తర్వాత ఫుల్ స్టోరీ చెప్పాను. ఆయనకు నచ్చింది. చిన్న మార్పులు సూచించారు. ఆ తర్వాత సెట్స్‌పైకి వెళ్లాం. గోపీచంద్‌గారు అద్భుతమైన నటుడు. ఆయన చేసిన ‘భీమా’ పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రాధామోహన్‌గారు నిర్మించిన ‘బెంగాల్ టైగర్’కు కొరియోగ్రాఫర్‌గా చేశాను. ఇప్పుడు ఆయన నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం హ్యాపీ’’ అన్నారు. -
‘భీమా’ డిఫరెంట్ కాప్ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్
‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్ డిఫరెంట్ కాప్ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► కోవిడ్ టైమ్‌లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది. ► భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం. ► హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది. ► ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది. ► రవిబస్రూర్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు. ► ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది.