- డైరెక్టర్ ఎ. హర్ష
‘‘సినిమాలో ఏ మాత్రం ల్యాగ్ ఉన్నా సరే థియేటర్స్‌లో ఆడియన్స్ మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు. సో... ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయాలంటే మంచి స్క్రీన్ ప్లే ఉండాలి. ‘భీమా’లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది. ఎలివేషన్.. ఎమోషన్.. ఎంటర్‌టైన్‌మెంట్‌లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో ‘భీమా’ చిత్రంలో ఓ సామాజిక సందేశం కూడా ఉంది’’ అన్నారు దర్శకుడు ఎ. హర్ష.
గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో ఎ.హర్ష మాట్లాడుతూ– ‘‘కరోనా సెకండ్ వేవ్ సమయంలో ‘భీమా’ చిత్రం సహనిర్మాత శ్రీధర్‌గారు ఓ కథ ఉంటే చెప్పమన్నారు. ఆన్‌లైన్‌లో గోపీచంద్‌గారికి ‘భీమా’ స్టోరీలైన్ చెప్పాను. ఆ తర్వాత ఫుల్ స్టోరీ చెప్పాను. ఆయనకు నచ్చింది. చిన్న మార్పులు సూచించారు. ఆ తర్వాత సెట్స్‌పైకి వెళ్లాం. గోపీచంద్‌గారు అద్భుతమైన నటుడు. ఆయన చేసిన ‘భీమా’ పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. రాధామోహన్‌గారు నిర్మించిన ‘బెంగాల్ టైగర్’కు కొరియోగ్రాఫర్‌గా చేశాను. ఇప్పుడు ఆయన నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం హ్యాపీ’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment