‘భీమా’ డిఫరెంట్‌ కాప్‌ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్‌ | Gopichand Talk About Bhimaa Movie | Sakshi
Sakshi News home page

‘భీమా’ డిఫరెంట్‌ కాప్‌ స్టోరీ..ఫాంటసీ ఎలిమెంట్స్ కొత్తగా ఉంటాయి: గోపీచంద్‌

Published Tue, Mar 5 2024 4:46 PM | Last Updated on Tue, Mar 5 2024 5:15 PM

Gopichand Talk About Bhimaa Movie - Sakshi

‘ఇప్పటికే నేను పలు సినిమాల్లో పోలీసు పాత్రలు చేశాను. గోలీమార్‌ డిఫరెంట్‌ కాప్‌ స్టోరీ. ఆంధ్రుడు లవ్ స్టొరీ మీద నడుస్తుంది కానీ దాని నేపధ్యం పోలీసు కథే. శౌర్యం కూడా భిన్నమైన కథ. ఈ మూడు చిత్రాలకు పూర్తి వైవిధ్యమైన పాత్ర భీమా. లాంటి పోలీసు కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అదే నాకు చాలా ఆసక్తిని కలిగించింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు హీరో గోపీచంద్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రం రీలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా గోపీచంద్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

కోవిడ్‌ టైమ్‌లో దర్శకుడు హర్ష నాకొక కథ చెప్పారు. అది బాగుంది కానీ ఇలాంటి సమయంలో వద్దనిపించింది. పోలీసుకి సంబధించి ఏదైనా డిఫరెంట్ కథ ఉంటే చెప్పమన్నాను. ఎనిమిది నెలలు గ్యాప్ తీసుకొని భీమా 'కథ' చెప్పారు. కథ, భీమా క్యారెక్టరైజేషన్ చాలా నచ్చింది. అలా కథలోని సెమీ ఫాంటసీ ఎలిమెంట్ కూడా చాలా నచ్చింది. అలా భీమా మొదలైయింది.

 భీమా కమర్షియల్ ప్యాక్డ్ మూవీ. భీమా పాత్రలో చాలా ఇంటన్సిటీ ఉంటుంది. ప్రేమ, ఎమోషన్స్, రోమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా చూసి బయటికి వచ్చాక భీమా ప్రేక్షకుడి మనసులో నిలబడిపోతాడనే నమ్మకం ఉంది. ఈ కథలో సెమీ ఫాంటసీ ఎలిమెంట్ ని దర్శకుడు చాలా అద్భుతంగా బ్లెండ్ చేశాడు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ లో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉంది.

► ఈ చిత్రాన్ని చాలా మంది 'అఖండ' తో పోలుస్తున్నారు. కానీ ఆ కథతో దీనికి ఎలాంటి సంబంధం లేదు. అఘోరాలు, కలర్ పాలెట్, మ్యూజిక్ వల్ల అలా అనిపించవచ్చు ఏమో కానీ భీమా పూర్తిగా డిఫరెంట్ స్టొరీ. అయితే నిజంగా 'అఖండ' పోలిస్తే మంచిదేగా (నవ్వుతూ). భీమా పరశురామక్షేత్రంలో జరిగే కథ. అందుకే అలాంటి నేపధ్యం తీసుకున్నాం.  

హర్ష చాలా అనుభవం వున్న దర్శకుడు. చాలా అద్భుతంగా తీశాడు. చాలా ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే  చేశాడు. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది, మలుపులు, సెమీ ఫాంటసీ ఎలిమెంట్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఇందులో హీరో క్యారెక్టర్ పేరు భీమా. ఈ కథకు అదే పేరు యాప్ట్ అని టైటిల్ గా పెట్టడం జరిగింది.

ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మల పాత్రలు సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి. కథకు కావాల్సిన పాత్రలు. పాత్రలకు ఒక పర్పస్ ఉంటుంది.

రవిబస్రూర్ మ్యూజిక్‌ సినిమాకు మరింత ప్లస్‌ అయింది. ట్రైలర్ లో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. దానికి మించి సినిమాలో ఉంటుంది. మంచి మ్యూజిక్ ఇవ్వాలనే అంకితభావంతో పని చేశాడు.  

ప్రస్తుతం శ్రీను వైట్ల గారితో ఓ సినిమా చేస్తున్న. ముఫ్ఫై శాతం షూటింగ్‌ పూర్తి అయ్యింది. తర్వాత ప్రసాద్ గారితో ఒక సినిమా ఉంటుంది. రాధతో ఒక కథ వర్క్ జరుగుతోంది. అది యూవీ క్రియేషన్స్ లో ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement