రష్మిక స్టయిలిష్‌ లుక్‌..ఎవరికోసం అంత ప్రేమ? | Rashmika Mandanna Chic Pantsuit Stylish look goes viral | Sakshi
Sakshi News home page

రష్మిక స్టయిలిష్‌ లుక్‌..ఎవరికోసం అంత ప్రేమ?

Published Wed, Jan 31 2024 11:11 AM | Last Updated on Wed, Jan 31 2024 3:11 PM

Rashmika Mandanna Chic Pantsuit Stylish look goes viral - Sakshi

సూపర్ హిట్  సినిమాలతో దూసుకుపోతున్న స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న. ప్యాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన యానిమల్‌ సక్సెస్ జోష్‌లో మునిగి తేలుతున్న ఈ  బ్యూటీ స్టైలింగ్‌లో కూడా తన  ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది.

సోషల్ మీడియాలో బ్యూటిఫుల్‌ మూమెంట్స్‌,  స్టయిలిష్‌ పిక్స్‌తో  ఎపుడూ యాక్టివ్‌గా  ఉండే  రష్మిక  తాజాగా  లవ్లీ ఫోటోలతో సందడి చేస్తోంది. తనదైన స్టయిల్‌లో, నార్మల్ లుక్‌ దుస్తులతో రష్మిక షేర్‌ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం యానిమల్ ఓటీటీలో సందడి చేస్తోంది. ఇదే విషయాన్ని సూచిస్తూ ఆమె తన ఫోటోలను షేర్‌ చేసింది.

అయితే ఫ్యాన్స్‌ మాత్రం ఎవరికోసం అంత ప్రేమ అంటున్నారు. లైట్‌ బ్లూకలర్‌ ఫుల్-స్లీవ్ బ్లేజర్, స్ట్రెయిట్-ఫిట్ టైలర్డ్ ప్యాంట్‌తో చేసిన ఫోటో షూట్‌తో పాటు, చెవులకు ధరించిన వెండి ఇయర్‌కఫ్‌లు, లవ్‌ సింబల్స్‌ మరింత ఎట్రాక్టివ్‌గా మారాయి.

అంతకుముందు, ముదురు ఎరుపు రంగు ప్యాంట్‌సూట్‌లోనూ, ఇటీవల రెడ్‌  చీరలోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement