
‘రెడ్’ సినిమాను రెడీ చేసే పనిలో ఉన్నారు రామ్. తాజాగా మరో పీరియాడిక్ సినిమా చేయబోతున్నారు అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అందుకు కారణం రామ్ తాజా ఫోటోషూట్ స్టిల్సే. ఈ ఫోటోషూట్ స్టిల్స్‌లో యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు రామ్. ఇది కొత్త సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ అని అనుకున్నారంతా! కానీ ఓ క్యాలెండర్ కోసం ఫొటోగ్రాఫర్ కార్తిక్ శ్రీనివాస్ హీరో రామ్‌ను ఇలా రాయల్ లుక్‌లోకి మార్చారు. విశేషం ఏంటంటే రామ్ పదేళ్ల వయసులో తన పోర్ట్‌ఫోలియో కోసం కార్తిక్ శ్రీనివాసే ఫొటోషూట్ చేశారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ఫొటోషూట్ కోసం కలిశారు ఇద్దరూ. ఇక ప్రస్తుతం రామ్ నటిస్తున్న ‘రెడ్’ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకుడు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మాత. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment