రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా.. | Anasuya Bharadwaj Shares Her New Photo Shoot Pics | Sakshi

రెచ్చిపోయిన అనసూయ, ఏకంగా వీధుల్లో ఇలా..

May 2 2021 4:30 PM | Updated on May 2 2021 5:39 PM

Anasuya Bharadwaj Shares Her New Photo Shoot Pics - Sakshi

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటూ బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే.. అటూ వెండితెరపై తళుక్కున మెరుస్తోంది. కాగా అనసూయ ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియా ఎక్కువగా యాక్టివ్‌ ఉంటోంది. అంతేగాక నిత్యం ఫొటోషూట్‌లు చేస్తూ నెటిజన్లకు కనులవిందు అందించే ఈ భామ ఈసారి మరింత రెచ్చిపోయింది. మోకాళ్లపైకి ఉన్న బ్లాక్‌ డ్రెస్‌ ధరించి వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి కుర్రకారు మతి పోగోడుతుంది.

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇద్దరూ పిల్లల తల్లైన ఈ భామ సినిమాల్లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇటూ సినిమమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌లోనూ తళుక్కున మెరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనసూయ. కాగా ప్రస్తుతం అనసూయ పుష్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక తమిళంలో విజయ్‌ సేతుపతితో, మాలయాళంలో మోహాన్‌ లాల్‌తో కలిసి నటించే ఛాన్స్‌ కూడా కొట్లెసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement