
సాక్షి, హైదరాబాద్: స్టార్ కిడ్స్ పిల్లలు ఏం చేసినా అవి వార్తల్లో నిలుస్తుంటాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని ముందంజలో ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే సితార ఇప్పటికే సోషల్ మీడియా సెలబ్రిటిగా మారింది. సూపర్ స్టార్ కూతురుగానే కాక, డ్యాన్స్, పాటలు పాడటం వంటి మల్టీ టాలెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సితార.
ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించి తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్న సితార లైట్ పింక్ ఫ్రాక్‌లో అచ్చం బార్బిడాల్‌లా కనిపిస్తోంది. ఎంతో అందంగా ముద్దు ముద్దుగా ఫొటోలకు ఫొజులు ఇచ్చిన ఈ ఫొటోలను సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింటా సందడి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment