హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లలో మిస్సవుతున్న వినోదాన్ని సోషల్ మీడియా వేదికగా అందించే ప్రయత్నం చేస్తున్నారు సినీ సెలబ్రెటీలు. ఈ జాబితాలో సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే నమ్రతా శిరోద్కర్.. మహేశ్, గౌతమ్, సితారలకు సంబంధించిన ఫోటో, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. అంతేకాకుండా త్రో బ్యాక్(పాత) ఫోటో, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఘట్టమనేని ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. (రాజమౌళితో మహేశ్ సినిమా ఆశించొచ్చా?)
తాజాగా తన ముద్దుల కూతురు సితార పారిస్ హోటల్‌లో క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. సెలవుల్లో కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ ఆపలేదని కామెంట్ జతచేశారు. దీనినే అంకితభావం అని అంటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక జర్మనీ వీధుల్లో గౌతమ్, సితారలతో కలిసి సైక్లింగ్ చేస్తున్న మరో త్రో బ్యాక్ వీడియోను కూడా నమ్రతా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ రెండు పాత వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మహేశ్ సినిమాల విషయానికి వస్తే పరుశురామ్ దర్వకత్వంలో ‘సర్కారు వారి పాట’ రూపొందుతున్న విషయం తెలిసిందే. (మహేశ్ సర్‌ప్రైజ్ వచ్చింది.. ట్రెండింగ్‌లో టైటిల్)
సితార క్లాసికల్ డ్యాన్స్.. నమ్రత సైక్లింగ్
Published Wed, Jun 3 2020 2:54 PM | Last Updated on Wed, Jun 3 2020 3:17 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment